ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Karnataka Assembly: కర్ణాటకలో ‘నీట్‌’ రద్దు!

ABN, Publish Date - Jul 26 , 2024 | 05:55 AM

ఎంబీబీఎస్‌, డెంటల్‌ కోర్సుల్లో ప్రవేశానికై దేశవ్యాప్తంగా నిర్వహించే అర్హతా పరీక్షలు ‘నీట్‌’ను కర్ణాటకలో రద్దు చేసేందుకు శాసనసభ ఉభయసభలు తీర్మానించాయి.

  • రాష్ట్ర శాసనసభ, మండలి తీర్మానం

  • మరో మూడు కీలక బిల్లులకూ ఆమోదం

బెంగళూరు, జూలై 25(ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌, డెంటల్‌ కోర్సుల్లో ప్రవేశానికై దేశవ్యాప్తంగా నిర్వహించే అర్హతా పరీక్షలు ‘నీట్‌’ను కర్ణాటకలో రద్దు చేసేందుకు శాసనసభ ఉభయసభలు తీర్మానించాయి. వైద్య విద్యాశాఖ మంత్రి శరణుప్రకాష్‌ పాటిల్‌ గురువారం శాసనసభలో తొలుత ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘నీట్‌’ విధానంతో రాష్ట్ర పరిధిలోని గ్రామీణ విద్యార్థులకు వైద్య విద్యకు అవకాశాలు లభించడం లేదన్నారు. రాష్ట్రంలోని మెడికల్‌ కళాశాలల హక్కులను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘నీట్‌’ పరీక్షా వ్యవస్థ కాలరాస్తోందని ఆరోపించారు. శాసనసభలో ఆమోదించిన ‘నీట్‌’ రద్దు బిల్లును శాసనమండలిలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ప్రవేశపెట్టగా సభ్యుల ఆమోదంతో ఆమోదించారు.


ఒక దేశం.. ఒకే ఎన్నికకు వ్యతిరేక బిల్లు

ఒక దేశం ఒకే ఎన్నిక జరపాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శాసనసభలో బిల్లును ఆమోదించారు. బీజేపీ, జేడీఎస్‌ సభ్యులు వ్యతిరేకిస్తున్నా అధికార కాంగ్రెస్‌ సభ్యులు సభలో అంగీకారం తెలిపారు. శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ మరో బిల్లుకు అంగీకారం తెలిపారు. 2026 లేదా ఆ తర్వాత జరిగే జనాభా లెక్కలకు అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన సరికాదని, 1971 జనాభా ఆధారంగా పునర్విభజన చేయాలని ఆ బిల్లు ద్వారా కోరారు. ఆదివాసీలకు అటవీ సంరక్షణ చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలనే బిల్లుకు కూడా ఆమోదం తెలిపారు. ఈ బిల్లులకు శాసన మండలిలోనూ ఆమోదముద్ర వేశారు.

Updated Date - Jul 26 , 2024 | 05:55 AM

Advertising
Advertising
<