Politics: ఓబీసీ రిజర్వేషన్లు తొలగించామనేది పచ్చి అబద్ధం.. మోదీపై విరుచుకుపడిన సిద్ధరామయ్య
ABN, Publish Date - Apr 26 , 2024 | 07:25 AM
కర్ణాటకలో ఓబీసీల(OBC) రిజర్వేషన్లు తొలగించి ముస్లింలకు ఇచ్చారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య(Sidda Ramaiah) తీవ్రంగా స్పందించారు. మోదీ(PM Modi) చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని.. ఓబీసీల రిజర్వేషన్లు తొలగించలేదని స్పష్టం చేశారు.
బెంగళూరు: కర్ణాటకలో ఓబీసీల(OBC) రిజర్వేషన్లు తొలగించి ముస్లింలకు ఇచ్చారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య(Sidda Ramaiah) తీవ్రంగా స్పందించారు.
మోదీ(PM Modi) చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని.. ఓబీసీల రిజర్వేషన్లు తొలగించలేదని స్పష్టం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. 1974లో ఎల్‌జీ హవనూర్ కమిషన్ నివేదిక తర్వాత ముస్లింలు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్‌లో భాగమయ్యారని అన్నారు.
Delhi: రెండో దశ బరిలో హేమాహేమీలు.. రాహుల్, హేమమాలిని భవితవ్యం తేలేది నేడే
‘‘మా ప్రభుత్వం వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. గత బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు కేటగిరీ 2బీ కింద ఉన్న 4 శాతం బీసీ (వెనుకబడిన తరగతి) రిజర్వేషన్లను తొలగించింది. ఈ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. కేసు పెండింగ్‌లో ఉండటంతో మార్పులను అమలు చేయబోమని అప్పటి బసవరాజ్ బొమ్మై సర్కార్ హామీ ఇచ్చింది. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (NCBC)ని రాజకీయాల్లోకి లాగుతున్నారు. రిజర్వేషన్లు మార్చే అంశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని చట్టంలో స్పష్టంగా ఉంది. ఇందులో ఎన్సీబీసీ జోక్యం అక్కర్లేదు. ఎన్సీబీసీ ఈ మధ్య విడుదల చేసిన ప్రెస్ నోట్ ఎన్నికలకు ముందు ప్రజలను గందరగోళానికి గురి చేస్తోంది. కర్ణాటక ప్రభుత్వం ముస్లింలకు కొత్త రిజర్వేషన్లు కల్పించిందన్న అభిప్రాయాన్ని ఇది కలిగిస్తుంది. ఇది పచ్చి అబద్ధం. రాష్ట్రంలో ముస్లింల వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ 1977 నుంచి ఉనికిలో ఉంది." అని సిద్ధరామయ్య అన్నారు. ప్రధాని మోదీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అనవసర ఆరోపణలు చేస్తున్నారని సిద్ధూ వ్యాఖ్యానించారు.
Read Latest National News and Telugu News
Updated Date - Apr 26 , 2024 | 07:28 AM