Bangalore : కర్ణాటక గవర్నర్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు

ABN, Publish Date - Aug 22 , 2024 | 05:10 AM

కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌.. తన అధికారిక పర్యటనల కోసం బుల్లెట్‌ ప్రూఫ్‌ కారును తెప్పించుకున్నారు.

Bangalore : కర్ణాటక గవర్నర్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు

  • అధికారిక కార్యక్రమాలకు తాత్కాలికంగా దూరం

బెంగళూరు, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌.. తన అధికారిక పర్యటనల కోసం బుల్లెట్‌ ప్రూఫ్‌ కారును తెప్పించుకున్నారు. ముడా ఇంటి స్థలాల వివాదంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రాసిక్యూషన్‌కు అనుమతులు ఇచ్చిన గవర్నర్‌కు వ్యతిరేకంగా రాష్ట్రమంతా అధికార కాంగ్రెస్‌ పార్టీ నిరసనలు చేపట్టింది. మంత్రులు, సీనియర్‌ నేతలు, శాసనసభ్యులు గవర్నర్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.


బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా పరిస్థితి గవర్నర్‌కు పడుతుందని సీనియర్‌ ఎమ్మెల్సీ ఐవాన్‌ డిసౌజా వ్యాఖ్యానించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్‌ అప్రమత్తమయ్యారు. ఇంటెలిజెన్స్‌ సూచనల మేరకు సాధారణ కారుకు బదులుగా బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు వాడాలని నిర్ణయించుకున్నారు.


బెంగళూరు విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆయన బుధవారం పాల్గొనాల్సి ఉన్నప్పటికీ హాజరు కాలేదు. బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కర్ణాటక గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఆయన బుల్లెట్‌ ప్రూఫ్‌ కారును తిరస్కరించారు. తాజా పరిణామాలతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

Updated Date - Aug 22 , 2024 | 05:10 AM

Advertising
Advertising
<