ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు బిగ్ రిలీఫ్

ABN, Publish Date - Sep 30 , 2024 | 06:35 PM

ఎన్నికల బాండ్ల కొనుగోలు చేయాలంటూ బెదిరింపుల కేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలకు సోమవారం కర్ణాటక హైకోర్టు భారీ ఊరట నిచ్చింది. ఈ కేసు విచారణను నిలిపివేస్తూ.. హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

బెంగళూరు, సెప్టెంబర్ 30: ఎన్నికల బాండ్ల కొనుగోలు చేయాలంటూ బెదిరింపుల కేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలకు సోమవారం కర్ణాటక హైకోర్టు భారీ ఊరట నిచ్చింది. ఈ కేసు విచారణను నిలిపివేస్తూ.. హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల బాండ్ల కొనుగోలు చేసేందుకు బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, పలువురు బీజేపీ అగ్రనేతలతోపాటు ఈడీ ఉన్నతాధికారులపై బెంగళూరులోని తిలక్ నగర్‌ పోలీస్‌‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిలక్ నగర్ పీఎస్‌లో వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: Tirumala Laddu: దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచండి: సుప్రీం ధర్మాసనం

Also Read: Viral Video: మొసలి నోట్లో చెయ్యి పెట్టాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..


ఇంతకీ ఏం జరిగిందంటే.. ?

ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసేందుకు వివిధ సంస్థలను బెదిరించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, బీజేపీ అగ్రనేతలు, పలువురు ఈడీ ఉన్నతాధికారులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో వారిపై జ్జానధికార్ సంఘర్ష పరిషత్ సంస్థ సహా అధ్యక్షుడు అదర్ష్ అయ్యార్ తిలక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదును స్వీకరించేందుకు ఆ స్టేషన్‌ పరిధిలోని పోలీసులు అభ్యంతరం తెలిపారు. దాంతో గతేడాది ఏప్రిల్‌లో చట్టసభ ప్రతినిధుల కోర్టును ఆయన ఆశ్రయించి.. పిటిషన్ దాఖలు చేశారు.

Also Read: Mahalaya Amavasya 2024: మహాలయ అమావాస్య రోజు.. జస్ట్ ఇలా చేయండి చాలు..

Also Read: Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి టికెట్ లేదా.. అయినా ఇలా చేస్తే వెంటనే దర్శించుకోవచ్చు..


దాంతో ఈ పిటిషన్‌పై సెప్టెంబర్ 27వ తేదీన ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. ఆ క్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌‌‌తోపాటు ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను అక్టోబర్ 10వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

Also Read: Web Story: గోంగూర వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలి పెట్టరు

Also Read: Tirumala: కోనేటి రాయుడి సేవలో ఒకరోజు.. టికెట్ ఎంతంటే..

Also Read: ముందుగా టికెట్ బుక్ చేయకున్నా.. తిరుమల వెంకన్నను ఇలా ఈజీగా దర్శించుకోవచ్చు.. ఎలాగంటే..?


దాంతో ఈ కేసు విచారణ నిలిపి వేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ బీజేపీ కీలక నేతలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దాంతో సోమవారం హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల బాండ్ల బెదిరింపుల కేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, ఈడీ ఉన్నతాధికారులు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక బీజేపీ అగ్రనేతలు నళిని కుమార్ కటిల్, విజయేంద్రలకు వ్యతిరేకంగా పోలీసులకు అదర్ష్ అయ్యార్ ఫిర్యాదు చేసిన విషయం విధితమే.

For National News And Telugu News..

Updated Date - Sep 30 , 2024 | 06:36 PM