Kejriwal: ఈడీ కస్టడీలో క్షిణిస్తున్న కేజ్రీవాల్ ఆరోగ్యం.. ఆప్ వెల్లడి
ABN, Publish Date - Mar 27 , 2024 | 06:14 PM
డయాబెటిక్‌తో బాధపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, ఈడీ కస్టడీలో ఉన్న ఆయన షుగర్ లెవెల్స్ దారుణంగా పడిపోయాయని ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారంనాడు ఆరోపించింది. ఆయన షుగర్ లెవెల్స్ ఒక దశలో 46 ఎంజీ స్థాయికి పడిపోయిందని, ఇది ప్రమాదకరమైన పరిస్థితిని అని వైద్యులు చెబుతున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
న్యూఢిల్లీ: డయాబెటిక్‌తో బాధపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, ఈడీ కస్టడీలో ఉన్న ఆయన షుగర్ లెవెల్స్ దారుణంగా పడిపోయాయని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) బుధవారంనాడు ఆరోపించింది. ఆయన షుగర్ లెవెల్స్ ఒక దశలో 46 ఎంజీ స్థాయికి పడిపోయిందని, ఇది ప్రమాదకరమైన పరిస్థితిని అని వైద్యులు చెబుతున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
సునీతా కేజ్రీవాల్ ఆందోళన
కాగా, కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆయన భార్య సునితా కేజ్రీవాల్ సైతం బుధవారంనాడు ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను జైలులో మంగళవారం కలుసుకున్నానని, ఆయన ఒంట్లోని చక్కెర స్థాయిలు పడిపోతున్నాయని అన్నారు. అయితే ఆయన ధైర్యంగానే ఉన్నట్టు చెప్పారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రజలంతా ప్రార్థించాలని కోరారు. మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయగా, 28వ తేదీ వరకూ ఆయను కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈడీ కస్టడీని కేజ్రీవాల్ సవాలు చేయడంతో దీనిపై విచారణ జరుగుతోంది. ఈడీ కస్టడీ ముగియనుండటంతో ఆయనను గురువారంనాడు కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 27 , 2024 | 06:22 PM