ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dark Tourism: కేరళలో ప్రకృతి విలయం.. వెలుగులోకి డార్క్ టూరిజం.. అసలేంటిది?

ABN, Publish Date - Aug 01 , 2024 | 05:25 PM

కేరళలోని వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం అందరికీ తెలిసిందే. బుధవారం కొండచరియలు విరిగిపడటంతో.. 167 మంది మృతి చెందారు. ఇంకా వందల..

Dark Tourism

కేరళలోని (Kerala) వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం అందరికీ తెలిసిందే. బుధవారం కొండచరియలు విరిగిపడటంతో.. 167 మంది మృతి చెందారు. ఇంకా వందల సంఖ్యలో ప్రజలు చిక్కుకొని ఉన్నారు. దీంతో.. పోలీసులు, రెస్క్యూ బృందాలు అక్కడ విస్తృతస్థాయిలో సహాయక చర్యలు చేపట్టాయి. ఇలాంటి తరుణంలో.. ‘డార్క్ టూరిజం’ (Dark Tourism) అనేది ఇప్పుడు తెరమీదకు వచ్చింది. విపత్తు ప్రాంతాలను సందర్శించవద్దని, అది సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తుందని పోలీసులు ఎక్స్ వేదికగా అభ్యర్థన చేయడంతో.. ఆ పదం నెట్టింట్లో వైరల్‌గా మారింది. విపత్తు ప్రాంతాలను నివారించాలని, అవసరమైతే సహాయం కోసం 112కు కాల్ చేయాలని తమ ట్వీట్‌లో రాసుకొచ్చారు.


ఇంతకీ డార్క్ టూరిజం అంటే ఏమిటి?

మరణం, విషాదం, హింస లేదా అసాధారణమైన సంఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాలను సందర్శించడాన్నే ‘డార్క్ టూరిజం’ అని అంటారు. ఇందులో స్మశానవాటికలు, సమాధులు, మార్చురీలు, విపత్తు ప్రాంతాలు, యుద్దభూములు, జైళ్లు, ఉరితీసే ప్రాంతాలతో పాటు నేర చరిత్ర కలిగిన ప్రదేశాలు వంటివి ఉంటాయి. ఉదాహరణకు.. ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ జోన్ గురించి అందరూ వినే ఉంటారు. ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో నాలుగో రియాక్టర్ పేలిపోవడంతో.. భారీ ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం సంభవించింది. ఇప్పుడది డార్క్ టూరిజంలో ఒక డెస్టినేషన్‌గా మారింది. అలాగే.. పోలాండ్‌లోని ఆష్విట్జ్ క్యాంప్స్, అమెరికాలోని 9/11 మెమోరియల్‌తో పాటు హాంటెడ్ హౌస్‌లు, పారానార్మల్ యాక్టివిటీ, చారిత్రక సంఘటనలు జరిగిన ప్రదేశాలు కూడా ఈ టూరిజంలో భాగమే.


ఈ టీవీ షోల కారణంగా..

ఈ మధ్యకాలంలో డార్క్ టూరిజం అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా.. ‘చెర్నోబిల్’, ‘ద డార్క్ టూరిస్ట్’ వంటి వెబ్ సిరీస్‌ల పుణ్యమా అని.. జనాలు డార్క్ టూరిజంపై మక్కువ చూపించడం మొదలుపెట్టారు. ఆ ప్రదేశాల చరిత్రతో పాటు అక్కడి సంస్కృతి గురించి తెలుసుకోవడం.. విషాదాలను అనుభవించిన ప్రజల ఉద్వేగాలను ప్రత్యక్షంగా కనెక్ట్ అవ్వడం కోసమే.. సందర్శకులు ఆయా ప్రాంతాలను సందర్శిస్తుంటారు. ఈ డార్క్ టూరిజం కారణంగా చారిత్రక ఘటనలను తెలుసుకోవడంతో పాటు.. బాధలు అనుభవించిన వారికి నివాళులు అర్పించడానికి వీలు కలుగుతుంది. ఎలాగైతే టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రకృతి అందాలను టూరిస్టులు ఆస్వాదిస్తారో.. అలాగే డార్క్ టూరిజంతో చరిత్రతో పాటు బాధితుల భావోద్వేగతంతో కనెక్ట్ అవుతుంటారు.


కేరళ పోలీసుల అభ్యర్థన

ఇప్పుడు వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి విలయం కారణంగా తీవ్ర విషాదం చోటు చేసుకోవడంతో.. డార్క్ టూరిజంలో భాగంగా పర్యాటకులు ఆ విపత్తు ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. అలా వస్తే.. సహాయక చర్యలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. అందుకే.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎవరూ అక్కడికి రావొద్దని కేరళ పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని.. వందలాది మంది ప్రజల ఆచూకీ కోసం కసరత్తులు చేస్తున్నామని.. అందుకే సందర్శకులు రావొద్దని ఎక్స్ వేదికగా కోరారు.

Read Latest National News and Telugu News

Updated Date - Aug 01 , 2024 | 05:25 PM

Advertising
Advertising
<