Kerala: ఎర్నాకుళం- బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం..!
ABN , Publish Date - Jul 31 , 2024 | 11:10 AM
ఎర్నాకుళం - బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కొత్త సర్వీస్ బుధవారం ప్రారంభం కానుంది. వారంలో మూడు రోజుల పాటు ఈ ఎక్స్‌ప్రెస్ రైలు నడవనుంది. మధ్యాహ్నం 12.50 గంటలకు ఎర్నాకుళంలో ఈ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరుతుంది. అదే రోజు.. రాత్రి 10.00 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.
తిరువనంతపురం, జులై 31: ఎర్నాకుళం - బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కొత్త సర్వీస్ బుధవారం ప్రారంభం కానుంది. వారంలో మూడు రోజుల పాటు ఈ ఎక్స్‌ప్రెస్ రైలు నడవనుంది. మధ్యాహ్నం 12.50 గంటలకు ఎర్నాకుళంలో ఈ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరుతుంది. అదే రోజు.. రాత్రి 10.00 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.
Also Read:Sindhudurg: లలిత భర్త సతీశ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
ఆ స్టేషన్లలో మాత్రమే ఆగనుంది..
ఇక బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 5.30 గంటలకు బయలుదేరి.. మధ్యహ్నం 2.20 గంటలకు ఎర్నాకుళం చేరుకోనుంది. అయితే ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు... త్రిస్పూర్, పాలక్కాడ్, పొత్తన్నూర్, తిరుప్పూర్, ఈరోడ్, సేలం స్టేషన్లలో ఆగుతుందని రైల్వే శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Also Read:IAS aspirants’ death in Delhi: మృతులు ముగ్గురు కాదు.. 10 నుంచి 12 మంది..
వారంలో మూడు రోజులు మాత్రమే..
అయితే ఎర్నాకుళం నుంచి బెంగళూరుకు ఏసీ చెయిర్ కార్ టికెట్ ధర 1,465 గా నిర్ణయించారు. అలాగే ఎగ్జిక్యూటీవ్ చైర్ కార్ ధర రూ.2,945గా ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. ఎర్నాకుళం నుంచి బెంగళూరుకు ప్రతి బుధ, శుక్ర, శనివారాల్లో ఈ సర్వీస్ బయలుదేరనుంది. అలాగే బెంగళూరు నుంచి ఎర్నాకుళంకు గురువారం, శనివారం, సోమవారం బయలు దేరుతుంది. ఈ మేరకు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.
Also Read: Wayanad landslides: 143కు చేరిన మృతులు.. రాహుల్, ప్రియాంక పర్యటన వాయిదా
బెంగళూరు ఐటీ రంగంలో పని చేస్తున్న..
ఇక ఈ కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీస్ వల్ల... బెంగళూరులోని ఐటీ రంగంలో పని చేస్తున్న మలయాళీలకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఈ రోజు ప్రారంభం కానున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుతో కలిపి కేరళలో మొత్తం ఈ తరహా రైళ్ల సంఖ్య మూడుకు చేరింది.
Read More National News and Latest Telugu News