ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttar Pradesh: ఆయన 'మాన్‌సూన్ ఆఫర్‌'ను డిప్యూటీ సీఎం ఎలా తిప్పికొట్టారంటే..?

ABN, Publish Date - Jul 19 , 2024 | 06:48 PM

ఉత్తపరప్రదేశ్ బీజేపీలో 'లుకలుకలు' తలెత్తాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పరోక్షంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు ఇచ్చిన 'మాన్ సూన్ ఆఫర్‌'ను ఆయన అంతే వేగంగా తిప్పికొట్టారు. మీ మాన్‌సూన్ ఆఫర్‌కు 2027లో ప్రజలే గట్టి జవాబు ఇస్తారంటూ కౌంటర్ ఇచ్చారు.

లక్నో: ఉత్తపరప్రదేశ్ (Uttar Pradesh)బీజేపీ (BJP)లో 'లుకలుకలు' తలెత్తాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ (SP) చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) పరోక్షంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు ఇచ్చిన 'మాన్ సూన్ ఆఫర్‌'ను ఆయన అంతే వేగంగా తిప్పికొట్టారు. మీ మాన్‌సూన్ ఆఫర్‌కు 2027లో ప్రజలే గట్టి జవాబు ఇస్తారంటూ కౌంటర్ ఇచ్చారు.


ఏమిటా ఆఫర్..?

సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ అఖిలేష్ యాదవ్ పరోక్షంగా కేశవ్ ప్రసాద్ మౌర్యకు ఇటీవల ఒక ప్రతిపాదన చేశారు. ''మాన్ సూన్ ఆఫర్: సౌ లావో, సర్కార్ బనావో'' (100 మందిని తెండి..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి) అంటూ అఖిలేష్ గురువారంనాడు రాంపూర్‌లో జరిగిన ఒక ర్యాలీలో వ్యాఖ్యానించారు. దీనిపై కేశవ్ ప్రసాద్ మౌర్య శుక్రవారంనాడు కౌంటర్ ఇచ్చారు.

Yogi Kanwar orders: కన్వర్ యాత్రపై యోగి వివాదాస్పద ఆదేశాలు.. భగ్గుమన్న సొంతపార్టీ నేతలు


''మాన్‌సూన్ ఆఫర్‌కు ప్రజలే 2027 ఎన్నికల్లో గట్టి జవాబిస్తారు. ఆ పార్టీ (ఎస్‌పీ) మునుగుతున్న నౌక. చివరిదశకు వచ్చింది. ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. ఆయనను (అఖిలేష్) కలలు కననీయండి. ఆ కలులు ఎప్పటికీ నెరవేరవు 2027లోనూ 2017 పరిస్థితినే పునరావృతం చేస్తాం. మళ్లీ బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది'' అని మౌర్య అన్నారు.

For More National News and Telugu News..

Updated Date - Jul 19 , 2024 | 06:48 PM

Advertising
Advertising
<