ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మోదీ, యోగిపై కుంభమేళాలో దాడి చేస్తాం: పన్నూ

ABN, Publish Date - Dec 26 , 2024 | 05:49 AM

ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిలపై దాడి చేస్తామంటూ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ బెదిరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

న్యూఢిల్లీ, డిసెంబరు 25: ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిలపై దాడి చేస్తామంటూ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ బెదిరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. ఇందుకుతన ఉగ్రవాద సంస్థ సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎ్‌ఫజే) కుంభమేళా సందర్భంగా ప్రతీకారం తీర్చుకుంటుందన్నాడు.


నకిలీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సిక్కు యువతను చంపినట్టు ఆ వీడియోలో పన్నూ ఆరోపించాడు. చనిపోయిన ఉగ్రవాదుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్టు హామీ ఇచ్చాడు. కుంభమేళాలలో భాగంగా షాహి స్నానాలకు శుభప్రదమైన జనవరి 14, 29, ఫిబ్రవరి 3వ తేదీల్లో దాడులు చేయనున్నట్టు చెప్పాడు. ఆ రోజుల్లో ప్రధాని మోదీ, సీఎం యోగిలు ప్రయాగ్‌రాజ్‌లో ఉంటారని నొక్కిచెప్పాడు.

Updated Date - Dec 26 , 2024 | 05:49 AM