ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Khushboo: మహిళాభివృద్ధి కోసమే వక్ఫ్‌ బోర్డు చట్ట సవరణ..

ABN, Publish Date - Aug 10 , 2024 | 12:07 PM

మహిళల అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డు చట్ట సవరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిందని జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు, సినీ నటి ఖుష్బూ(Actress Khushboo) పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

- జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ

చెన్నై: మహిళల అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డు చట్ట సవరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిందని జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు, సినీ నటి ఖుష్బూ(Actress Khushboo) పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ముస్లింలు తరతరాల నుంచి మతం పేరుతో ఆచరిస్తున్న ‘ముత్తలాక్‌’ పేరుతో మహిళలను బానిసలుగా చూశారని, ఏ వర్గంలో అయినా మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు.

ఇదికూడా చదవండి: Chennai: స్టాలిన్‌ తలచుకుంటే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి..


ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముత్తలాక్‌ చట్టాన్ని నిషేధించి, ముస్లిం మహిళలకు స్వేచ్ఛ కల్పించడంతో పాటు ఆస్తులపై సమాన హక్కు కూడా వర్తింపజేశారని తెలిపారు. ప్రస్తుతం పార్లమెంటులో గురువారం ప్రవేశపెట్టిన వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు కూడా ముస్లిం మతపెద్దలతో చర్చించిన తర్వాతే తీసుకొచ్చారని, అయితే ఈ బిల్లును ప్రతిపక్షాలు రాజకీయంగా పరిగణిస్తూ వ్యతిరేకించడం సరికాదని ఖుష్బూ పేర్కొన్నారు.


.............................................................................

ఈ వార్తను కూడా చదవండి:

..............................................

కేంద్ర వైద్యులతో సమానంగా వేతనాలివ్వాలి

- డాక్టర్‌ అన్బుమణి

చెన్నై: రాష్ట్ర ప్రభుత్వ వైద్యులకు కూడా కేంద్ర ప్రభుత్వ వైద్యులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని పీఎంకే అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి(PMK President Dr. Anbumani) కోరారు. ఈ విషయంపై ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వేతనాలు పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు చేస్తున్న డిమాండ్‌ న్యాయసమ్మతమైందన్నారు. ఏడో వేతన కమిటి సిఫార్సుల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైద్యులకు మూలవేతనం రూ.56,100గా ఉండాలన్నారు.


అయితే, కేంద్ర ప్రభుత్వ వైద్యులు 14 యేళ్ళ సర్వీసు పూర్తి చేసుకుంటే వేతనం రూ.1.23 లక్షలకు చేరుతుందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ వైద్యులకు మాత్రం 20 యేళ్ళ సర్వీసు పూర్తి చేసుకుంటేనే ఈ వేతనం వస్తుందన్నారు. ఈ వ్యత్యాసాన్ని సవరించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వైద్యులకు సమానంగా వేతనాలు చెల్లించాలని ఆయన కోరారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 10 , 2024 | 12:07 PM

Advertising
Advertising
<