ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kolkata Doctor Murder Case: ‘హత్యాచార ఘటనతో టీఎంసీకి సంబంధముంది’

ABN, Publish Date - Aug 16 , 2024 | 08:19 PM

పశ్చిమ బెంగాల్‌లో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా దిగాజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ రాష్ట్రంలో చట్టం లేదని లేకుండా పోయిందని మండిపడ్డారు. ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో నిందితులు చాలా మంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

కోల్‌కతా, ఆగస్ట్ 16: కోల్‌కతాలో ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచారం ఘటనతో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధముందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. ఈ కేసులో నిందితులను రక్షించేందుకు సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: Kolkata Medical student murder: ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎదుట వైద్యుల ‘ఆరు డిమాండ్లు’


రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు..

పశ్చిమ బెంగాల్‌లో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా దిగాజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ రాష్ట్రంలో చట్టం లేదని లేకుండా పోయిందని మండిపడ్డారు. ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో నిందితులు చాలా మంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్యాచార ఘటనపై ఇండియా కూటమి మౌనంగా ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితుడిగా పట్టుకున్న సంజయ్ రాయ్‌పై అనేక ఆరోపణలున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలోని పోలీసుల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు.

Also Read: Maharastra Assembly Elections : బాస్ అనుమతి ఇవ్వలేదు.. అందుకే


షాజియా ఇల్మీ స్పందన..

పార్టీ జాతీయ ప్రతినిధి షాజియా ఇల్మీ సైతం ఎక్స్ వేదికాగా స్పందించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణ అనేది గాలిలో దీపంగా మారిందన్నారు. గురువారం అర్థరాత్రి ఆర్ జీ కార్ ఆసుపత్రిపై వేలాది మంది దుండగులు దాడి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Also Read: Hyderabad City: పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఆకస్మిక తనిఖీలు


నాలుగు రోజుల తర్వాత రాహుల్.. నేటికి స్పందించని ప్రియాంక..

మరోవైపు ఈ ఘటనపై ఇండియా కూటమి స్పందించకపోవడం పట్ల ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ అలోక్ స్పందించారు. ఈ ఘటనపై ఇండియా కూటమిలోని పలు భాగస్వామ్య పక్ష పార్టీలకు చెందిన అధినేతలు స్పందించడం లేదేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై రాహుల్ గాంధీ నాలుగు రోజుల తర్వాత గొంతు విప్పారని గుర్తు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాత్రం నేటికి స్పందించలేదన్నారు.

Also Read: Jammu Kashmir: ఎన్నికల ప్రకటనకు ముందు రాష్ట్రంలో కీలక పరిణామాలు

అలాగే తేజస్వీ యాదవ్, అఖిలేశ్ యాదవ్‌ల నుంచి స్పందన కూడా లేదన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం రోహ్యాంగా ముస్లింల రక్షణ కోసమే పని చేస్తుందన్నారు. మిగిలిన వారిని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇకనైన మమతా బెనర్జీ స్పందించి.. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని అజయ్ అలోక్ డిమాండ్ చేశారు.

Also Read: Kolkata doctor case: మమతా బెనర్జీ ప్రభుత్వంపై మండిపడ్డ కోల్‌కతా హైకోర్టు

Also Read:Raksha Bandhan 2024: రాఖీ పౌర్ణమి.. శుభ ముహూర్తం ఎప్పుడంటే..? ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కట్టాలంటే..?

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 16 , 2024 | 08:21 PM

Advertising
Advertising
<