ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mamata Banerjee: 'అపరాజిత' బిల్లు చరిత్రాత్మకం

ABN, Publish Date - Sep 03 , 2024 | 03:23 PM

అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు మరణదండన విధించేందుకు ఉద్దేశించిన 'అపరాజిత ఉమన్ అండ్ చైల్డ్ బిల్లు (వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ ఎమెండమెంట్)-2024ను పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో మంగళవారంనాడు ప్రవేశపెట్టారు. ఇది 'చరిత్రాత్మిక బిల్లు' అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో ప్రసంగిస్తూ పేర్కొన్నారు.

కోల్‌కతా: అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు మరణదండన విధించేందుకు ఉద్దేశించిన 'అపరాజిత ఉమన్ అండ్ చైల్డ్ బిల్లు (వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ ఎమెండమెంట్)-2024ను పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో మంగళవారంనాడు ప్రవేశపెట్టారు. ఇది 'చరిత్రాత్మిక బిల్లు' అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అసెంబ్లీలో ప్రసంగిస్తూ పేర్కొన్నారు. అత్యాచారం, లైంగిక నేరాలపై కొత్త ప్రొవిజన్స్‌తో రూపొందించిన ఈ బిల్లు మహిళలు, పిల్లలకు మరింత రక్షణ కల్పిస్తుందని అన్నారు.


అత్యాచారాలు మానవత్వానికి మాయని మచ్చ అని, అలాంటి నేరాలకు అట్టుకట్ట వేసేందుకు సామాజిక సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని మమతా బెనర్జీ అన్నారు. అపరాజిత బిల్లుపై సంతకం చేయాలని విపక్షాలు గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ను కోరాలని సూచించారు. అనంతరం చట్టంగా తీసుకు వచ్చే బాధ్యత మనపై ఉందన్నారు.

Cellphone jammer: హీరో దర్శన్ వ్యవహారంతో ఇక.. కట్టుదిట్టంగా సెల్‏ఫోన్ జామర్లు...


మోదీ, అమిత్‌షా రాజీనామాకు డిమాండ్

ఇటీవల కాలంలో అత్యాచారాలు, లైంగిక వైధింపులు వెలుగు చూసిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. మహిళల రక్షణకు సమర్ధవంతంగా చట్టాలను అమలు చేయడంలో వీరు విఫలమయ్యారని అన్నారు. 'అపరాజిత' బిల్లు ద్వారా కేంద్ర చట్టంలోని లోపాలను వెలిక తీసేందుకు తాము ప్రయత్నించామని చెప్పారు. మహిళలపై ఎక్కువగా అత్యాచార నేరాలు యూపీ, గుజరాత్‌లో జరుగుతుంటాయని, కానీ బెంగాల్‌లో చిత్రహింసలకు గురయ్యే మహిళలకు కోర్టుల్లో న్యాయం జరుగుతుంటుందని అన్నారు.

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 03 , 2024 | 05:59 PM

Advertising
Advertising