ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sandeshkhali: సందేశ్‌ఖాళి ఘటన నిజమైతే సిగ్గు చేటు: కోల్ కతా హైకోర్టు

ABN, Publish Date - Apr 04 , 2024 | 05:05 PM

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కోల్ కతా హైకోర్టు గురువారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సందేశ్‌ఖాళి ఘటనకు సంబంధించి అఫిడవిట్లపై చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. సందేశ్‌‌ఖాళిలో టీఎంసీ నేత షేక్ షాజహాన్, అతని అనుచరులు దోపిడీ, భూ కబ్జా, లైంగిక వేధింపుల గురించి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ (West Bengal) ప్రభుత్వంపై కోల్ కతా (Kolkata) హైకోర్టు గురువారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సందేశ్‌ఖాళి ఘటనకు సంబంధించి అఫిడవిట్లపై చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. సందేశ్‌‌ఖాళిలో టీఎంసీ నేత షేక్ షాజహాన్, అతని అనుచరులు దోపిడీ, భూ కబ్జా, లైంగిక వేధింపుల గురించి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. షాజహాన్ నుంచి టీఎంసీ ప్రభుత్వం కాపాడటం సరికాదని అభిప్రాయ పడింది.


సిగ్గుచేటు

‘సందేశ్ ఖాళిలో జరిగిన దారుణాలపై దాఖలైన ఒక్క అఫిడవిట్ నిజమైనా సరే సిగ్గుచేటు. పశ్చిమ బెంగాల్‌లో అసలు మహిళలకు రక్షణ ఉందా..? మహిళల వేధింపులకు సంబంధించి ఒక్క అఫిడవిట్ రుజువు అయినా సరే రాష్ట్రానికి ఉన్న పేరు పోతుంది. ఇందుకు సందేశ్ ఖాళి జిల్లా యంత్రాంగం, అధికార పార్టీ నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుంది అని’ చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం ఆగ్రహం వ్యక్తం చేశారు.


55 రోజులు ఏం చేశారు

సందేశ్ ఖాళిలో జరిగిన దారుణాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రధాన నిందితుడు షేక్ షాజహాన్‌‌ను అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారు. అన్ని వర్గాల నుంచి ఒత్తిడి రావడంతో 55 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. ఆ అంశంపై సీజే శివజ్ఞానం మండిపడ్డారు. ‘నిందితుడుని పట్టుకునేందుకు ఇంత సమయం ఎందుకు పట్టింది. షాజహాన్‌ను పట్టుకునేందుకు 55 రోజులు ఎక్కడ పరుగెత్తారు. దాగుడు మూతలు ఎక్కడ ఆడారు. మీరు కళ్లు మూసుకుంటే ప్రపంచం నల్లగా మారదు అని’ సీజే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి:

Borewell: 20 గంటల తర్వాత సురక్షితంగా బయటకు రెండేళ్ల బాలుడు

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట.. వ్యక్తిగత నిర్ణయమంటూ ఆ పిటిషన్ తిరస్కరణ

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 04 , 2024 | 05:07 PM

Advertising
Advertising