Kolkata Medical student murder: ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎదుట వైద్యుల ‘ఆరు డిమాండ్లు’
ABN, Publish Date - Aug 16 , 2024 | 04:55 PM
శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో ఆందోళనకు దిగిన వైద్యులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎదుట ‘వైద్యులు’ తమ ఆరు డిమాండ్లను ఉంచారు. ఈ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని వారు ఈ సందర్భంగా మంత్రి జేపీ నడ్డాను డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ, ఆగస్ట్ 16: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన బాట పట్టారు.
మంత్రి జేపీ నడ్డాతో వైద్యులు భేటీ.. ఆరు డిమాండ్లు ఇవే..
ఆ క్రమంలో శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో ఆందోళనకు దిగిన వైద్యులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎదుట ‘వైద్యులు’ తమ ఆరు డిమాండ్లను ఉంచారు. ఈ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని వారు ఈ సందర్భంగా మంత్రి జేపీ నడ్డాను డిమాండ్ చేశారు. ఆగస్టు 9వ తేదీ కోల్‌కతాలో వైద్యురాలి హత్యాచార కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలన్నారు.
Also Read: Jammu Kashmir: ఎన్నికల ప్రకటనకు ముందు రాష్ట్రంలో కీలక పరిణామాలు
నష్ట పరిహారం చెల్లించాల్సిందే.. తప్పదు..
అలాగే ఆరోగ్య రంగంలో విధులు నిర్వహిస్తున్న వారి సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందుకు సంబంధించిన ఆర్డినెన్స్ 48 గంటల్లో తీసుకు రావాలని విజ్జప్తి చేశారు. ఈ ఆర్డినెన్స్ బిల్లును వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జేపీ నడ్డాకు సూచించారు.
ఇక ట్రైయినీ వైద్యురాలు హత్యాచారానికి గురైన ఆర్ జీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో సీఏపీఎఫ్ బలగాలను మోహరించాలని విజ్జప్తి చేశారు. అలాగే బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారాన్ని సైతం చెల్లించాలని ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను డిమాండ్ చేశారు. అలా జరిగని పక్షంలో తమ ఆందోళనలు, నిరసనలు తీవ్రతరం చేయడం తప్ప.. తమకు మరో మార్గం లేదని ఆ డిమాండ్ పత్రంలో వైద్యులు స్పష్టం చేశారు.
Also Read: Kolkata doctor case: మమతా బెనర్జీ ప్రభుత్వంపై మండిపడ్డ కోల్‌కతా హైకోర్టు
ఆగస్ట్ 9వ తేదీన..
ఆగస్ట్ 9వ తేదీ తెల్లవారుజామున ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలు హత్యాచారానికి గురైంది. ఆగస్ట్ 8వ తేదీ రాత్రి.. అంటే గురువారం రాత్రి ఆసుపత్రిలో విధులకు హాజరైన ఆమె తెల్లవారుజామున కాన్పరెన్స్ హాల్లో విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లింది. అనంతరం ఆమెపై హత్యాచారం జరిగింది.
కాన్ఫరెన్స్ హాల్లో సగం నగ్నంగా ఉన్న ఆమె మృతదేహాన్ని వైద్య సిబ్బంది గమనించి.. ఆసుపత్రి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో..వారు వైద్యురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఆమెపై సామూహిక లైంగిక దాడి జరిగిందని స్పష్టమైంది. అలాగే హత్య అనంతరం ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు తెలింది. దీంతో ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
Also Read:Raksha Bandhan 2024: రాఖీ పౌర్ణమి.. శుభ ముహూర్తం ఎప్పుడంటే..? ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కట్టాలంటే..?
ఈ కేసు సీబీఐకి అప్పగించిన కోర్టు...
ఆ క్రమంలో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పశ్చిమ బెంగాల్ పోలీసులను కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. మరోవైపు గురువారం తెల్లవారుజామును.. వేలాది మంది దుండుగులు ఆర్ జీ కార్ ఆసుపత్రిలోకి ప్రవేశించి.. విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై కోల్‌కతా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని స్పష్టం చేసింది. ఈ దాడి ఘటనపై ఆగస్ట్ 21వ తేదీలోగా నివేదిక అందజేయాలని పోలీస్ ఉన్నతాధికారులతోపాటు ఆసుపత్రి అధికారులను ఆదేశించింది.
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 16 , 2024 | 04:56 PM