ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kolkata Doctor Case: కోల్‌కత్తా డాక్టర్ కేసులో సీబీఐ మరో సంచలనం

ABN, Publish Date - Aug 23 , 2024 | 07:49 PM

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ విచారణ వేగం పెరగడంతో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నేరం జరిగినట్టు భావిస్తున్న ఆసుపత్రి సెమినార్ హాలు డోర్ బోల్డ్ విరిగిపోవడం తాజాగా సీబీఐ దృష్టికి వచ్చింది.

కోల్‌కతా: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు (Kolkata doctor rape-murder case)లో సీబీఐ (CBI) విచారణ వేగం పెరగడంతో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నేరం జరిగినట్టు భావిస్తున్న ఆసుపత్రి సెమినార్ హాలు డోర్ బోల్డ్ విరిగిపోవడం తాజాగా సీబీఐ దృష్టికి వచ్చింది. విచారణలో భాగంగా జూనియర్ డాక్టర్ సిబ్బంది సెమినార్ హాలులో గొళ్లెం పనిచేయక పోవడం గురించి బయటపెట్టారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.


ట్రైనీ డాక్టర్ మృతదేహం కనిపించిన ఆగస్టు 9వ తేదీన ఆమె 36 గంటల సుదీర్ఘ విధుల అనంతరం ఉదయం 4 గంటల సమయంలో ఆసుపత్రి సెమినార్ హాలులో నిద్రపోయింది. అక్కడే ఆమెపై సివిక్ వాలంటీర్, నిందితుడు సంజయ్ రాయ్ అత్యాచారం చేసి, హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. అయితే, సెమినార్ హాలులో బాధితురాలిని చిత్ర హింసలు పెడుతున్న సమయంలో హాలు లోపల నుచి శబ్దాలు ఎవ్వరికీ వినిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని సీబీఐ చెబుతోంది. హాలు బయట నిల్చొని ఎవరైనా సహకరించారా అనే కోణంలోంచి కూడా దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతోంది. ఇందుకోసం అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తోంది. ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల ప్రాంతంలో సెమినార్ హాలులోకి అడుగుపెట్టి, అక్కడ పడుకోవడం చూసినట్టు డ్యూటీ వైద్యుడు ఒకరు విచారణలో బయటపెట్టినట్టు సీబీఐ వెల్లడించింది. డోర్ పనిచేయని విషయం అందరికీ తెలిసిన విషయమేనని, బాధితురాలు ఆ రోజు డోర్ లాక్ చేసుకునేందుకు వీలుంటే ఈ ఘాతుకం జరిగి ఉండేది కాదని పలువురు డాక్టర్లు, ఇంటర్నెలు, జూనియర్ డాక్టర్లు సీబీఐ విచారణలో వెల్లడించారు.

Kolkata rape-murder case: మమతకు ఝలక్.. ఫెస్టివల్ గ్రాంట్‌‌ను తోసిపుచ్చిన దుర్గా పూజా కమిటీలు


కాగా, కేసు విచారణలో భాగంగా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి చెందిన నలుగురు ఉద్యోగులపై పాలీగ్రాఫ్ పరీక్షలను సీబీఐ నిర్వహించనుంది. వీరిలో ముగ్గురు జూనియర్ డాక్టర్లు కూడా ఉన్నారు. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో వీరి ప్రమేయం ఉందా అని ఈ లీగ్రాఫ్ పరీక్షల ద్వారా ఒక అవగాహనకు సీబీఐ రానుంది. ఘటన జరిగిన రెండ్రోజులకు రాజీనామా చేసిన ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సపాల్ ‌సందీప్ ఘోష్‌పై లై-డిటెక్టర్ పరీక్షలు జరిపేందుకు కూడా సీబీఐ అనుమతి తీసుకుంది. హత్యాచారం కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు 14 గంటల జాప్యం కావడంపై సందీప్ ఘోష్, బెంగాల్ పోలీసులను సుప్రీంకోర్టు ఇప్పటికే చీవాట్లు పెట్టింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం ఘోష్ చేశారని కూడా అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 23 , 2024 | 08:11 PM

Advertising
Advertising
<