ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు
ABN, Publish Date - Mar 15 , 2024 | 07:44 PM
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. పాట్నాలో గల రాజేంద్ర నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు చికిత్స అందిస్తున్నారు.
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. పాట్నాలో గల రాజేంద్ర నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు చికిత్స అందిస్తున్నారు. పలు నివేదికల ప్రకారం.. తేజ్ ప్రతాప్ యాదవ్ తన ఇంట్లో ఉన్న సమయంలో ఛాతీలో నొప్పి రావడంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తేజ్ ప్రతాప్ యాదవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలు బయటికి వచ్చాయి. ఓ ఫోటోలో తేజ్ ప్రతాప్ యాదవ్‌కు ఆక్సిజన్ మాస్క్ తొడికి చికిత్స అందిస్తున్నారు.
కాగా గురువారం తేజ్ ప్రతాప్ యాదవ్ బక్సర్ జిల్లాలో పర్యటించారు. అక్కడి కార్మికులతో సమావేశమయ్యారు. అంతేకాకుండా కృష్ణబ్రహ్మలోని జ్ఞాన బిందు లైబ్రరీని ప్రారంభించారు. అంతకుముందు జూలై 2023లో కూడా తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనను పాట్నాలోని కంకర్‌బాగ్‌లోని మెడివర్సల్ ఆసుపత్రిలో చేర్పించారు. కొంతకాలం ఐసీయూలో చికిత్స పొంది కోలుకున్న తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రస్తుతం బీహార్‌లోని హసన్‌పూర్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నితీష్ కుమార్, ఆర్జేటీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా కూడా పని చేశారు. అంతకుముందు బీహార్ ఆరోగ్య శాఖ మంత్రి కూడా సేవలు అందించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 15 , 2024 | 07:44 PM