ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uddhav Thackeray: సీఎం అభ్యర్థి ఎవరో ముందు వాళ్లను తేల్చుకోనీయండి

ABN, Publish Date - Oct 13 , 2024 | 05:05 PM

మహారాష్ట్రలోని అధికార మహయుతి ప్రభుత్వంపై విపక్ష మహా వికాస్ అఘాడి ఆదివారంనాడు విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, అవినీతి, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ఆక్షేపణ తెలిపింది.

ముంబై: మహారాష్ట్రలోని అధికార మహయుతి ప్రభుత్వంపై విపక్ష మహా వికాస్ అఘాడి (MVA) ఆదివారంనాడు విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, అవినీతి, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ఆక్షేపణ తెలిపింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది తొలుత వారిని (Mayayuti) ప్రకటించనీయండని పేర్కొంది. మహాయుతిలో బీజేపీ, ఎన్‌సీపీ, శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) ఉండగా, ఎంవీఏలో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ-ఎస్‌పీ (శరద్ పవార్ వర్గం) ఉన్నాయి.

Baba Siddique: ఖాన్ హీరోల మధ్య సంధాన కర్త, ఖరీదైన జీవితం, లగ్జరీ కార్ల కలెక్షన్


''బీజేపీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దొంగలు, ద్రోహుల నాయకత్వంలో ఆ పార్టీ పోటీ చేయక తప్పడం లేదు. ముందు తమ సీఎం అభ్యర్థి ఎవరో వారిని ప్రకటించనీయండి. ఆ తర్వాత మా సీఎం అభ్యర్థి ఎవరో మీ అందరికీ తెలియజేస్తాం. మహాయుతి అధికారంలో ఉన్నందున ముందు వారిని ప్రకటించనీయండి'' అని ఆదివారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉద్ధవ్ థాకరే అన్నారు. ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖి హత్యపై షిండే ప్రభుత్వం చర్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నానని థాకరే ఆరోపించారు. ఇంతవరకూ ఎవరిని అరెస్టు చేశారో తెలియదని, విపక్ష నేతల కదలికలపై నిఘా వేయడమే కానీ నేరస్థులపై ఎలాంటి నిఘా లేదన్నారు.


సీఎం అభ్యర్థిపై మాదీ అదే మాట..

కాగా, సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై థాకరే చేసిన వ్యాఖ్యలను ఎన్‌సీపీ-ఎస్‌పీ సుప్రీం శరద్ పవార్, కాంగ్రెస్ నేత నానా పటేలే సమర్ధించారు. విపక్ష కూటమి వైఖరిని చాలా స్పష్టంగా థాకరే చెప్పారని పవార్ తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ స్కామ్‌పై విమర్శలు గుప్పించారు. ఈ పథకం అంతా మోసం అని, బడ్జెట్‌పై కానీ, ఫైనాన్షియల్ ప్రొవిజన్స్‌పై కానీ ఎలాంటి స్పష్టత లేదని అన్నారు. మహారాష్ట్ర ధర్మానికి తూట్లు పొడుస్తున్నారంటూ ఒక బుక్‌లెట్‌ను కూడా ఈ సందర్భంగా పవార్ విడుదల చేశారు. కాగా, రాష్ట్రంలో ఏ ఒక్కరికీ భద్రత లేదనే విషయం బాబా సిద్ధిఖి హత్యతో రుజువైందని నానా పటేలో ఆరోపించారు. రాజకీయాలు చేయడంలో మాత్రమే ప్రభుత్వం బిజీగా ఉందన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగాల్సి ఉన్నాయి.


Read More National News and Latest Telugu News

ఈ వార్తలు కూడా చదవండి:

Baba Siddique murder: దసరా బాణసంచా పేలుళ్ల మధ్య సిద్ధిఖిపై కాల్పులు

Baba Siddique: అందుకే బాబా సిద్ధిఖీని హత్య చేశారా?

Updated Date - Oct 13 , 2024 | 05:05 PM