Lok sabha Elections 2024: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ.. మమత దూకుడు ముందు బోల్తా!
ABN, Publish Date - Jun 04 , 2024 | 03:49 PM
నాలుగు వందల పైచిలుకు లోక్‌సభ స్థానాలు సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఎన్డీయే పశ్చిమబెంగాల్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 41 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాల్లో విజయం సాధించింది.
నాలుగు వందల పైచిలుకు లోక్‌సభ స్థానాలు సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఎన్డీయే పశ్చిమబెంగాల్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 41 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాల్లో విజయం సాధించింది. ఈ పర్యాయంలో 30 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించింది. మరోవైపు మమతా బెనర్జీ ఇండియా కూటమిలో చేరి ప్రచారం నిర్వహించారు.
ప్రస్తుతం వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో బెంగాల్‌లో మమత పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. తృణమూల్ కాంగ్రెస్ 31 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. మరోవైపు 30 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ కేవలం 10 సీట్లకే పరిమితమైంది. ఓట్ల శాతంలో కూడా మమత పార్టీ భారీ ఆధిక్యంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటివరకు 47 శాతం ఓట్లు సాధించి దూసుకెళ్తోంది. బీజేపీ 37 శాతం ఓట్లు, కాంగ్రెస్ 4.6 శాతం ఓట్లు సాధించాయి. 2019లో 22 లోక్‌సభ స్థానాలు దక్కించుకున్న మమత పార్టీ ఈసారి మరింత బలపడి 31 స్థానాలకు పెరిగింది.
Updated Date - Jun 04 , 2024 | 03:49 PM