ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections: ఢిల్లీలో లక్షకు పైగా పోలింగ్ సిబ్బంది.. ఓటర్లకు స్విగ్గీ, జొమాటో కూపన్లు

ABN, Publish Date - May 24 , 2024 | 02:34 PM

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల కమిషన్ విస్తృత ఏర్పాట్లు చేసింది. లక్షకు మందికి పైగా పోలింగ్ సిబ్బందిని మోహరించినట్టు ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి పి.కృష్ణమూర్తి తెలిపారు. ఉత్తర భారతదేశంలో వడగాలులు వీస్తుండటంతో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పలు చర్యలు చేపట్టినట్టు చెప్పారు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల కమిషన్ (Election Commission) విస్తృత ఏర్పాట్లు చేసింది. లక్షకు మందికి పైగా పోలింగ్ సిబ్బందిని మోహరించినట్టు ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి పి.కృష్ణమూర్తి తెలిపారు. ఉత్తర భారతదేశంలో వడగాలులు వీస్తుండటంతో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పలు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ఢిల్లీ వ్యాప్తంగా పూర్తిగా మహిళా సిబ్బందితో 70 పింక్ పోలింగ్ స్టేషన్లు, అత్యాధునిక వసతులతో 70 మోడల్ పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. తగినంత సిబ్బంది, లాజిస్టిక్స్, రవాణా సౌకర్యాలను కూడా కల్పించామని కృష్ణమూర్తి చెప్పారు.


దేశ రాజధానిలో ఉష్ణోగ్రత 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు చేయడంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు కూలర్లు, ఫ్యాన్లు, ర్యాంపులతో వెయిటింగ్ జోన్లు ఏర్పాటు చేశారు. అవసరమైన వీల్‌చెయిర్లు అందుబాటులో ఉంచారు. మెడికల్ కిట్లతో పారామెడికల్ సిబ్బందిని అన్ని పోలింగ్ ప్రాంతాల్లో మోహరించారు.

PM Modi : 2047 వరకు కష్టపడతా!


స్విగ్గీ, జొమాటో కూపన్లు

ఓటర్లకు తగిన సౌకర్యాలు కల్పంచడం ద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ర్యాపిడో బైక్ టాక్సీలను కూడా ఎన్నికల అధికారి అందుబాటులో ఉంచారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత ఓటర్లు వీటిపై ఉచితంగా ఇంటికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది. ఆన్‌లైన్ ఫుడ్‌కు ఆర్డర్ ఇచ్చేందుకు జొమాటో, సిగ్వీల నుంచి ఓటర్లు ప్రత్యేక కూపన్లు కూడా పొందవచ్చు. ఓటింగ్ 'ఇంక్' చూపిస్తే వివిధ రెస్టారెట్లు డిసౌంట్లు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేసింది. ఢిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ నియోజకవర్గాలకు శనివారంనాడు పోలింగ్ జరుగమనుంది. జూన్ 4న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

Read Latest News and National News here

Updated Date - May 24 , 2024 | 02:37 PM

Advertising
Advertising