ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Exit Poll: దక్షిణాదిలోనూ బీజేపీకి భారీ స్కోర్.. ఇండియా టీవీ సర్వే

ABN, Publish Date - Jun 01 , 2024 | 07:55 PM

లోక్‌సభ ఎన్నికల్లో విజయావకాశాలపై ఎగ్జిట్ పోల్ సర్వేలు వెలువడుతున్నాయి. మెజారిటీ పోల్ సర్వేలు ఎన్డీయే 350కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. ఆసక్తికరంగా ఈసారి ఎన్నికల్లో దక్షిణాదిలోనూ కమలం పార్టీ 57 నుంచి 65 సీట్ల వరకూ గెలుచుకునే అవకాశాలున్నాయని ''ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్'' వెల్లడించింది.

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో విజయావకాశాలపై ఎగ్జిట్ పోల్ సర్వేలు (Exit polls Surveys) వెలువడుతున్నాయి. మెజారిటీ పోల్ సర్వేలు ఎన్డీయే (NDA) 350కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. ఆసక్తికరంగా ఈసారి ఎన్నికల్లో దక్షిణాదిలోనూ కమలం పార్టీ 57 నుంచి 65 సీట్ల వరకూ గెలుచుకునే అవకాశాలున్నాయని ''ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్'' వెల్లడించింది. 'ఇండియా' కూటమి 59 నుంచి 66 సీట్లు, ఇతరులు 4 నుంచి 7 సీట్లు గెలుచుకుంటాయని పేర్కొంది.


రాష్ట్రాల వారీగా..

ఆంధ్రప్రదేశ్ (25 సీట్లు): టీడీపీ 13 నుంచి 15 సీట్లు, బీజేపీ 4-6 సీట్లు, జనసేన పార్టీ 2 సీట్లు, వైఎస్ఆర్‌సీపీ 3-5 సీట్లు గెలుుకుంటుంది. కాంగ్రెస్‌ ఖాతా కూడా తెరువదు.

కర్ణాటక (28 సీట్లు): ఎన్డీయే 20 నుంచి 24 సీట్లు, బీజేపీ 18-22, జేడీఎస్ 1-3, కాంగ్రెస్ 4-8 సీట్లు గెలుచుకుంటాయి.

తెలంగాణ (17 సీట్లు):

బీజేపీ 8 నుంచి 10, కాంగ్రెస్ 6-8, బీఆర్ఎస్ సున్నా నుంచి ఒకటి, ఏఐఎంఐఎం 1 సీటు గెలుచుకుంటాయి.

కేరళ (20) సీట్లు:

బీజేపీ 1 నుంచి 3, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ 13 నుంచి 15, ఎల్‌డీఎఫ్ 3 నుంచి 5 సీట్లు గెలుచుకుంటాయి.

తమిళనాడు (39):

బీజేపీ 5 నుంచి 7, డీఎంకే 16-18, కాంగ్రెస్ 6-8, ఏఐఏడీఎంకే సున్నా నుంచి ఒకటి, ఇతరులు 8 నుంచి 10 సీట్లు గెలుచుకుంటారు.

పుదుచ్చేరి (1)

బీజేపీకే పుదుచ్చేరి సీటు.

Updated Date - Jun 01 , 2024 | 08:55 PM

Advertising
Advertising