ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha polls: డీఎంకేతో సీట్ల షేరింగ్ సుఖాంతం.. కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లంటే..?

ABN, Publish Date - Mar 09 , 2024 | 08:34 PM

తమిళనాడులో మరోసారి 2019 సీట్ల షేరింగ్ ఫార్ములా పునరావృతమైంది. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో డీఎంకే, కాంగ్రెస్ మధ్య ఒప్పందం ఖరారైంది. కాంగ్రెస్‌‌కు తమిళనాడులో 9 సీట్లు, పొరుగున ఉన్న పుదుచ్చేరిలో ఒక సీటును డీఎంకే కేటాయించింది.

చెన్నై: తమిళనాడు (Tamilnadu)లో మరోసారి 2019 సీట్ల షేరింగ్ ఫార్ములా పునరావృతమైంది. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో డీఎంకే, కాంగ్రెస్ మధ్య ఒప్పందం ఖరారైంది. కాంగ్రెస్‌ (Congress)కు తమిళనాడులో 9 సీట్లు, పొరుగున ఉన్న పుదుచ్చేరి (Puducherry)లో ఒక సీటును డీఎంకే కేటాయించింది. ఏఐసీసీ నేతలు కేసీ వేణుగోపాల్, అజాయ్ కుమార్ సమక్షంలో డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు కె.సెల్వపేరున్తాగై మధ్య శనివారంనాడు జరిగిన చర్చలో ఈ ఒప్పందం కుదిరింది. డీఎంకే తమిళనాడు నుంచి 21 స్థానాల్లో పోటీ చేయనుంది.


అధికారికంగా పొత్తుల విషయాన్ని కేసీ వేణుగోపాల్ మీడియా ముందు ప్రకటించారు. తమిళనాడులో 9 స్థానాల్లోనూ, పాండిచ్చేరిలో ఒక స్థానంలోనూ కాంగ్రెస్ పోటీ చేస్తుందని, తక్కిన స్థానాల్లో డీఎంకే, భాగస్వామ్య పార్టీలకు మద్దతిస్తామని ఆయన తెలిపారు. తమిళనాడులోని 40 స్థానాలను తమ కూటమి గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్-డీఎంకే బంధం చెక్కుచెదరకుండా నిలిచిందని అన్నారు.


గత ఎన్నికల్లో...

కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని 39 పార్లమెంటరీ స్థానాల్లో కాంగ్రెస్ 9 స్థానాల్లోనూ, పాండిచ్చేరిలోని ఏకైక లోక్‌‌స్థానానికి పోటీ చేసింది. తమిళనాడులోని 9 స్థానాల్లో 8 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. డీఎంకే 20 స్థానాల్లో పోటీ చేసి అన్ని చోట్లా గెలిచింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గాను డీఎంకే 188 స్థానాల్లో పోటీ చేసి 133 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ 25 సీట్లలో పోటీ చేసి 18 సీట్లు నెగ్గింది.

Updated Date - Mar 09 , 2024 | 08:43 PM

Advertising
Advertising