Madras High Court: అన్నా యూనివర్శిటీ ఘటనపై సిట్ దర్యాప్తు.. బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం
ABN, Publish Date - Dec 28 , 2024 | 09:18 PM
ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. బాధితురాలి ఐడెంటిటీ బయటకు లీక్ కావడాన్ని సీరియస్‌గా తీసుకున్నధర్మాసనం దీనిపై కూడా సిట్ విచారణ జరపాలని ఆదేశించింది.
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో విద్యార్థినిపై అత్యాచార ఘటనపై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు శనివారంనాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)తో దర్యాప్తు జరిపించాలని ఆదేశించింది. ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. బాధితురాలి ఐడెంటిటీ బయటకు లీక్ కావడాన్ని సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు దీనిపై కూడా సిట్ విచారణ జరపాలని ఆదేశించింది.
Tejashwi Yadav: ఆ నలుగురి చేతిలో నితీష్ బందీ... తేజస్వి సంచలన వ్యాఖ్యలు
అన్నా యూనివర్శిటీలో అత్యాచార ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎస్ఎస్ సుబ్రమణియన్, వీ.లక్ష్మీనారారాయణతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. ''ఎఫ్ఆఆర్ లీక్ కావడంలో పోలీసుల తీవ్ర తప్పిందంగా భావిస్తున్నాం. ఇందువల్ల బాధితురాలు, ఆమె కుటుంబ ఆందోళనను మరింత పెంచుతుంది. బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల పరహారం చెల్లించాలి. ఆ మొత్తాన్ని విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎఫ్ఐఆర్ లీక్ కావడాన్ని బాధ్యులైన వారి నుంచి రికవర్ చేసుకోవచ్చు'' అని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన మీడియాకు ఇన్వెస్టిగేషన్ వివరాలు వెల్లడించిన చెన్నై పోలీస్ కమిషనర్‌పై తమిళనాడు ప్రభుత్వం అవసరమనుకుంటే చర్యలు తీసుకోవచ్చని కూడా ధర్మాసం పేర్కొంది.
అన్నా యూనివర్శిటీ తరఫున హాజరైన న్యాయమూర్తి జె.రవీంద్రన్.. బాధితురాలికి యూనివర్శిటీ అండగా ఉంటుందని, ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు కౌన్సిలింగ్ ఇస్తామని కోర్టుకు విన్నవించారు. విద్యార్థినికి, ఆమె కుటుంబానికి భరోసాగా నిలుస్తామన్నారు. యూనివర్శిటీలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై క్యాంపస్‌లో డిసెంబర్ 23న ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈ ఘటన తమిళనాడులో సంచలనం సృష్టించింది.
ఇవి కూడా చదవండి..
National: ఢిల్లీలో అంత్యక్రియలు జరగని మాజీ ప్రధానులు ఎవరో మీకు తెలుసా.. వీరిలో తెలుగు వ్యక్తి కూడా..
Manmohan Singh Funeral: మన్మోహన్ సింగ్ అంతిమ యాత్రలో రాహుల్ గాంధీ ఏం చేశారంటే
Read More National News and Latest Telugu News
Updated Date - Dec 28 , 2024 | 09:18 PM