ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Aditya Thackeray: ఆదిత్య థాకరే యువసేన క్లీన్ స్వీప్.. మాతోశ్రీలో సంబరాలు

ABN, Publish Date - Sep 28 , 2024 | 08:07 PM

ముంబై యూనివర్శిటీ సెనేట్ ఎన్నికల్లో అన్ని సీట్లు శివసేన (యూబీటీ) యువజన విభాగం గెలుచుకోవడంపై ఆదిత్య థాకరే సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అనుబంధ ఏబీవీపీ సహా అందరూ చిత్తుగా ఓడిపాయారని, మాతోశ్రీలో సంబరాలు మిన్నంటుతున్నాయని చెప్పారు.

ముంబై: శివసేన (UBT) నేత ఆదిత్య థాకరే (Aditya Thackeray) సారథ్యంలోని యువసేన (Yuvasena) శనివారంనాడు జరిగిన ముంబై యూనివర్శిటీ సెనేట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ సాధించింది. ఎన్నికలు జరిగిన 10 సీట్లలోనూ యువసేన విజయకేతనం ఎగురవేసింది. ఫలితాలు వెలువడగానే ఉద్ధవ్ థాకరే నివాసమైన 'మాతోశ్రీ'లో సంబరాలు మిన్నంటాయి.


శివసైనికులదే ఈ గెలుపు..

ముంబై యూనివర్శిటీ సెనేట్ ఎన్నికల్లో అన్ని సీట్లు శివసేన (యూబీటీ) యువజన విభాగం గెలుచుకోవడంపై ఆదిత్య థాకరే సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అనుబంధ ఏబీవీపీ సహా అందరూ చిత్తుగా ఓడిపాయారని, మాతోశ్రీలో సంబరాలు మిన్నంటుతున్నాయని చెప్పారు. విధేయులైన శివసైనికులకే ఈ విజయం చెందుతున్నారు. విధేయతకు అర్ధం ఏమిటో ఈ ఎన్నికల్లో అందరూ చూశారని, విద్యార్థులకు నిరంతర సేవలు అందించేందుకు తాము పునరంకితవుతామని చెప్పారు. ''విక్టరీతో మొదలుపెట్టాం. అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయపరంపర కొనసాగిస్తాం. భయం కారణంగానే ప్రభుత్వం ఈ ఎన్నికలను రెండేళ్లుగా జరక్కుండా చేసింది. ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరేపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. ఓటర్లకు, మా వర్కర్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను'' అని ఆదిత్య థాకరే అన్నారు.

Maharashtra Assembly Elections: మహారాష్ట్ర ఎన్నికలు ఎప్పుడని అడిగితే ఈసీ ఏమన్నారంటే?


శివసేన వెంటే యువత: సంజయ్ రౌత్

ముంబై యూనివర్శిటీకి అతిపెద్ద చారిత్రక సంస్థగా పేరుందని, రెండేళ్లుగా బీజేపీ, ముఖ్యమంత్రి ఇక్కడ ఎన్నికలు జరక్కుండా అడ్డుకున్నారని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తెలిపారు. హైకోర్టు అదేశాలతో జరిగిన ఈ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) విజయం సాధించిందని చెప్పారు. తమ వెంటే మహారాష్ట్ర యువత, మహిళలు ఉన్నారనడానికి ఈ విజయమే నిదర్శనమని అన్నారు. ఇవి కొనుక్కొనే ఓట్ల కావని, అందుకే ఈ గెలుపు చాలా కీలకమని చెప్పారు. ఇక్కడ ఈవీఎంలపై కాకుండా బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ జరిగిందని, అందువల్ల ట్యాంపరింగ్‌కు కూడా అవకాశం లేదని అన్నారు.


For National News And Telugu News..

Also Read: Hardeep Singh Puri: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా? కేంద్రమంత్రి కీలక ప్రకటన

Updated Date - Sep 28 , 2024 | 08:07 PM