ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Maharashtra: ఆ కలను సాకారం చేసింది మోదీనే.. సంజయ్ రౌత్ పై ఏక్‌నాథ్ షిండే ఫైర్..

ABN, Publish Date - Mar 22 , 2024 | 11:33 AM

శివసేన లీడర్ సంజయ్ రౌత్ పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) ని ఔరంగజేబుతో పోల్చాడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశాన్ని అనుమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శివసేన లీడర్ సంజయ్ రౌత్ పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) ని ఔరంగజేబుతో పోల్చాడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశాన్ని అనుమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలాసాహెబ్‌ కలలుగన్న రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసిన ప్రధానిని ఔరంగజేబుతో పోల్చడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దు చేయాలన్న బాల్ థాకరే కలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని ఆయనను మొఘల్ పాలకుడితో పోల్చవద్దని ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు.

400 ఏళ్ల క్రితం ఔరంగజేబు కారణంగా మహారాష్ట్ర ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నారు. అందరితో మాట్లాడి రాజ్యాన్ని చేజిక్కించుకునేలా ఔరంగజేబు వ్యవహరించాడు. విభజించు పాలించు అనే విధానాన్ని అవలంబించాడు. దిల్లీకి వెళ్లిన గుజరాత్ ప్రజలు కూడా అదే విధానాన్ని అవలంబిస్తున్నారు. మహారాష్ట్ర కోసం చరిత్ర పునరావృతం అవుతోందని సంజయ్ రౌత్ వ్యాఖ్యలు చేశారు.

BJP: ఆరాచకవాదులకు అడ్డాగా ఆ పార్టీ.. ఆప్ పై బీజేపీ విసుర్లు..


మరోవైపు.. శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ పై కేసు నమోదైంది. శివసేన అధికారిక పత్రిక సామ్నా వీక్లీ కాలమ్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ హోదాలో సంజయ్‌ రౌత్‌ ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై భాజపా నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యావత్మాల్‌ జిల్లా బీజేపీ కన్వీనర్‌ నితిన్‌ భూతడ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సంజయ్‌ రౌత్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Hemant Soren: మనీ లాండరింగ్ కేసు.. మాజీ సీఎం జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 22 , 2024 | 11:33 AM

Advertising
Advertising