ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maharashtra Polls: 65 మందితో ఉద్ధవ్ థాకరే తొలి జాబితా

ABN, Publish Date - Oct 23 , 2024 | 09:58 PM

'మహా వికాస్ అఘాడి' కూటమి మధ్య సీట్ల పంపకాల్లో భాగంగా కాంగ్రెస్, శివసేన (యూబీటీ), శరద్‌పవార్ ఎన్‌సీపీ సమానంగా 85-85-85 సీట్లకు ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. 288 మంది సభ్యుల అసెంబ్లీకి నవంబర్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elctions) నేపథ్యంలో 'మహా వికాస్ అఘాడి' (MVA)లో కీలక భాగస్వామ్య పార్టీ అయిన ఉద్ధవ్ థాకరే శివసేన (Siv Sena UBT) 65 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బుధవారంనాడు విడుదల చేసింది. ఇందులో 15 మంది పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 14 మందికి తిరిగి టిక్కెట్ ఇచ్చింది. ఆదిత్య థాకరే, రాజన్ విచారే ఇందులో ఉన్నారు. పార్లమెంటు మాజీ సభ్యుడైన రాజన్ విచారే.. థానే నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.

Jagadambika Pal: తృటిలో తప్పించుకున్నా.. దాడి ఘటనపై జేపీసీ చీఫ్


ప్రముఖులకు టిక్కెట్

తాజాగా పార్టీ టిక్కెట్లు ప్రకటించిన ప్రముఖుల్లో ఆదిత్య థాకరే (ఓర్లి), సునీల్ ప్రభు (దిన్దోషి), సంజయ్ పొట్నిస్ (కలిన), ప్రకాష్ ఫతర్పేకర్ (చెంబూరు), రమేష్ కోర్కావోంకర్ (భందుప్ వెస్ట్), సునీల్ రౌట్ (విక్రోలి), రతజు లట్కే (అంథేరి ఈస్ట్), వైభవ్ నికే (కుడల్), రాజన్ సాల్వి (రాజపూర్), భాస్కర్ జాదవ్ (గుహాగర్), కైలాస్ పాటిల్ (ఒస్మానాబాద్), రాహుల్ పాటిల్ (పర్బని), నితిన్ దేశ్‌ముఖ్ (బాలాపూర్), ఉదయ్‌సింగ్ రాజ్‌పుట్ (కన్నాడ్) ఉన్నారు. తొలి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యే అజయ్ చౌదరి (షివడి నియోజకవర్గం)కి చోటు దక్కలేదు.


కాగా, 'మహా వికాస్ అఘాడి' కూటమి మధ్య సీట్ల పంపకాల్లో భాగంగా కాంగ్రెస్, శివసేన (యూబీటీ), శరద్‌పవార్ ఎన్‌సీపీ సమానంగా 85-85-85 సీట్లకు ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. 288 మంది సభ్యుల అసెంబ్లీకి నవంబర్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.


ఇవి కూడా చదవండి..

Priyanka Gandhi: మీలో సొంత కుటుంబ సభ్యులను చూస్తున్నా.. వయనాడ్ సభలో ప్రియాంక ఎమోషనల్..

Priyanka Gandhi: తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ.. వయనాడ్‌లో ప్రియాంక నామినేషన్..

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 23 , 2024 | 09:58 PM