Maharashtra: మహారాష్ట్రలో కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం.. ముహూర్తం ఫిక్స్
ABN, Publish Date - Nov 30 , 2024 | 09:28 PM
ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఏక్‌నాథ్ షిండే ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు గురువారం రాత్రి దేశ రాజధాని న్యూఢిల్లీలో అమిత్ షాతో అజిత్ పవార్, ఫడ్నవీస్ సమావేశమై.. రాష్ట్రంలో అధికార పంపిణీ ఒప్పందంపై చర్చించారు.
ముంబయి, నవంబర్30: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. డిసెంబర్ 5వ తేదీ..అంటే గురువారం కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ముంబయిలోని ఆజాద్ మైదానంలో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్ కులే.. తన ఎక్స్ ఖాతా వేదికగా శనివారం వెల్లడించారు.
Also Read: అమరావతిలో సీఆర్‌డీఏ ఆఫీస్ నిర్మాణానికి డిజైన్ల రూపకల్పన..
Also Read: రైల్వేస్టేషన్ వద్ద భారీ అగ్నిప్రమాదం: వందలాది వాహనాలు దగ్ధం
మరోవైపు కొత్త మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం అయితే ఫిక్స్ చేశారు కానీ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారనే అంశంపై ఓ స్పష్టత అయితే రాలేదని తెలుస్తుంది. సీఎం అభ్యర్థిపై ఇంకా నిర్ణయం ఒక కొలిక్కి రాలేదని చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో సాగుతుంది. కానీ మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ఎంపిక దాదాపుగా ఖరారు అయిందనే ప్రచారం సైతం నడుస్తుంది. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేలాది మంది పార్టీ శ్రేణులు హాజరుకానున్నాయి.
Also Read: ఆర్కే రోజాకు మళ్లీ ప్రశ్నలు సంధించిన వైఎస్ షర్మిల
Also Read: ఆన్‌లైన్‌లో సీఆర్‌డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ డిజైన్లు
తదుపరి సీఎంకు మద్దతు ఇస్తాం: షిండే
ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఏక్‌నాథ్ షిండే ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు గురువారం రాత్రి దేశ రాజధాని న్యూఢిల్లీలో అమిత్ షాతో అజిత్ పవార్, ఫడ్నవీస్ సమావేశమై.. రాష్ట్రంలో అధికార పంపిణీ ఒప్పందంపై చర్చించారు. తదుపరి సీఎం ఎవరనే దానిపై బిజెపి నాయకత్వ నిర్ణయానికి తాను సంపూర్ణ మద్దతిస్తానని షిండే తెలిపారు. ఈ ప్రక్రియలో తాను అడ్డంకి కాబోనని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి బీజేపీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తుంది.
Also Read: పవన్ చేసింది కరెక్టే: ఎంపీ పురందేశ్వరి
Also Read: ఆర్కే రోజాపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
Also Read: రాహుల్ గాంధీ స్వాతిముత్యం
లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటని మహాయుతి.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విజయ ఢంకా మోగించింది. మహాయుతి కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన బీజేపీ132 సీట్లు, షిండే నేతృత్వంలోని శివసేన 57 స్థానాల్లో విజయం సాధించింది. ఇక అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకుంది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కి దారుణంగా ఓటమి పాలైంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 16 సీట్లు మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ కేవలం10 సీట్లు, ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షుడిగా ఉన్న (యూబీటీ) 20 సీట్లలో మాత్రమే విజయం సాధించింది.
క్షీణించిన ఏక్‌నాథ్ షిండే ఆరోగ్యం..!
మహారాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. ఆయన ఇన్‌ఫెక్షన్‌తోపాటు జర్వంతో బాధపడుతున్నారని తెలుస్తుంది. వైద్య పరీక్షల్లో ఆయనకు నెగటివ్ వచ్చిందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఆ క్రమంలో మెడికల్ అబ్జర్వేషన్‌లో ఆయన్ని ఉంచారు. అయితే రానున్న 24 గంటల్లో మహా సీఎం షిండే కీలక నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ నేత ప్రకటన చేసిన కొద్ది గంటలకే ఈ వార్త బయటకు రావడం గమనార్హం.
For National News And Telugu News
Updated Date - Nov 30 , 2024 | 09:33 PM