ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chhattisgarh: 30 మందికి పైగా నక్సల్స్‌ మృతి..

ABN, Publish Date - Oct 05 , 2024 | 04:28 AM

ఛత్తీ్‌సగఢ్‌ అడవులు కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లాయి ఆ రాష్ట్రంలోని నారాయణపూర్‌, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌ అడవుల్లో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

కాల్పులతో దద్దరిల్లిన అబూజ్‌మడ్‌

  • ఛత్తీస్‌గఢ్‌లో అతి భారీ ఎన్‌కౌంటర్‌

  • ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకుల స్వాధీనం

  • నెందూర్‌, తులతులి అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్లు ఇంటెలిజెన్స్‌ సమాచారం

  • రంగంలోకి డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌, ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్‌ 1,200 మందితో ఆపరేషన్‌.. ఎదురుపడిన

  • నక్సల్స్‌.. ఇరు వర్గాల మధ్య భారీ కాల్పులు

  • 28 మంది నక్సల్స్‌ మృతదేహాలు లభ్యం.. ఇంకా కొనసాగుతున్న కూంబింగ్‌

  • మృతుల్లో గ్రామస్థులూ ఉన్నారన్న అనుమానాలు

  • తుదిదశలో నక్సల్స్‌ ఏరివేత.. బలగాలకు

  • అభినందనలు: చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌

  • ఇటీవల వరుస ఎన్‌కౌంటర్లు.. 185 మంది మృతి

చర్ల, అక్టోబరు 4: చత్తీస్‌గఢ్‌ అడవులు కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లాయి ఆ రాష్ట్రంలోని నారాయణపూర్‌, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌ అడవుల్లో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. దద్దరిల్లిన అబూజ్‌మడ్‌ శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా నారాయణపూర్‌, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌ అడవులు కాల్పులతో దద్దరిల్లాయి. నారాయణపూర్‌, దంతెవాడ సరిహద్దు నెందూర్‌, తులతులి అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సమావేశమైనట్లు బలగాలకు ఇంటెలిజెన్స్‌ నుంచి శుక్రవారం సమాచారం అందింది.


ఈ రెండు జిల్లాలకు చెందిన జిల్లా రిజర్వు గార్డు (డీఆర్‌జీ), ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ (ఎస్టీఎ్‌ఫ)తో పాటు ఐటీబీపీ, బీఎ్‌సఎఫ్‌ బెటాలియన్లకు చెందిన మొత్తం 1200 మంది మావోయిస్టుల కోసం సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. ఓర్చా, బారాసూర్‌ పోలీస్‌ స్టేషన్ల పరిదిలోని గ్రామాలు గోవెల్‌, నెందూర్‌, తులతులి సమీపంలో శుక్రవారం ఉదయం అబూజ్‌మడ్‌లో బలగాలు కూంబింగ్‌ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో నెందూర్‌-తులతులి సమీపంలో మావోయిస్టులు తారసపడి కాల్పులు మొదలు పెట్టడంతో ప్రతిగా బలగాలు తీవ్రంగా స్పందించాయి. ఇరువర్గాల మధ్య భారీస్థాయిలో కాల్పులు జరిగాయి. సాయంత్రం అడవుల్లో గాలించగా 28 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను గుర్తించాల్సి ఉంది.


గాలింపు చర్యలు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. బలగాల్లో ఎవ్వరికీ గాయాలు కాలేదని బస్తర్‌ పోలీసులు తెలిపారు. కాగా ఈ ఏడాది జనవరి నుంచి బస్తర్‌ డివిజన్‌లోని ఏడు జిల్లాల్లో కాల్పుల మోతలు వినిపిస్తున్నాయి. వరుస గటనలతో బస్తర్‌ డివిజన్‌ వార్‌జోన్‌ మారాయి. ఇప్పటి వరకు జరిగిన 12 భారీ ఎన్‌కౌంటర్లలో 185 మంది మావోయిస్టులు మృతిచెందారు. బీజాపూర్‌లో, నారాయణ పూర్‌, సుకుమా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంట్లరలో నక్సల్స్‌ పదుల సంఖ్యలో మృతి చెందారు. 2009లో జరిగిన ఎన్‌కౌంటర్ల స్థాయిలో ఈ ఏడాది నక్సల్స్‌ మృతిచెందినట్లు చెబుతున్నారు.


  • వార్షికోత్సవాల వేళ ఎదురుదెబ్బ

మావోయిస్టు పార్టీ 20 ఏళ్ల వార్షికోత్సవాలను సెప్టెంబరు 21 నుంచి నెల రోజుల పాటు నిర్వహిస్తోంది. సమావేశాల్లో 20 ఏళ్లలో మావోయిస్టు పార్టీ ఎదుర్కొన్న ఆటుపోట్లు, అవరోధాలను నక్సల్స్‌ చర్చించనున్నారు. అడవుల్లో సభలు సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.


  • గ్రామస్థులూ ఉన్నారా?

ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య గంటగంటకూ పెరిగింది. ఈ క్రమంలో మృతులంతా మావోయిస్టులేనా? లేదంటే వారిలో గ్రామస్థులూ ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల కిత్రం కాంకేర్‌ జిల్లా అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో 12 మంది గ్రామస్థులను బలగాలు పట్టుకుని చంపాయని గ్రామస్థులు, మావోయిస్టులు ఆరోపించారు. తాజాగా ఎన్‌కౌంటర్‌లో కూడా ఇలానే జరిగిందా? అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 05 , 2024 | 04:28 AM