Share News

Mamata Banerjee: బంగ్లా బాధితులకు ఆశ్రయం.. కీలక ప్రకటన

ABN , Publish Date - Jul 21 , 2024 | 06:07 PM

రిజర్వేషన్ల సంస్కరణ కోసం జరుగుతున్న అల్లర్లతో బంగ్లాదేశ్‌ అతలాకుతలం అవుతుంది. హింసాత్మక ఘటనలను అడ్డుకొనేందుకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించినా.. ఆ దేశంలో అల్లర్లు మాత్రం ఆగడం లేదు.

Mamata Banerjee: బంగ్లా బాధితులకు ఆశ్రయం.. కీలక ప్రకటన
Mamata Banerjee addresses Trinamool Congress's 'Martyrs' Day' rally

కోల్‌కతా, జులై 21: రిజర్వేషన్ల సంస్కరణ కోసం జరుగుతున్న అల్లర్లతో బంగ్లాదేశ్‌ అతలాకుతలం అవుతుంది. హింసాత్మక ఘటనలను అడ్డుకొనేందుకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించినా.. ఆ దేశంలో అల్లర్లు మాత్రం ఆగడం లేదు. అలాంటి వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. ఆదివారం కోల్‌కతాలో నిర్వహించిన మైత్రీస్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడారు.

Also Read: Vizianagaram: శ్రీ విద్యా పీఠంలో గురుపౌర్ణమి వేడుకలు


బంగ్లాదేశ్ హింసలో బాధితులుగా మారిన వారు పశ్చిమ బెంగాల్ వస్తే.. ఆశ్రయం కల్పిస్తామని వారికి భరోసా ఇచ్చారు. బాధితులు తమ తలుపు కొడితే.. వారికి ఆశ్రయం కల్పించేందుకు తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే బంగ్లాదేశ్ వేరే దేశమని చెప్పారు. ఆ దేశం గురించి తానేమి మాట్లాడ లేనన్నారు. దీనిపై భారత ప్రభుత్వం మాట్లాడుతోందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. అయితే పొరుగు దేశం నుంచి వచ్చే శరణార్థులను గౌరవించాలని గతంలో ఐక్య రాజ్య సమితి చేసిన తీర్మానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Also Read: Arvind Kejriwal: బీజేపీతోపాటు ఎల్జీపై మళ్లీ మండిపడ్డ ఆప్


హింసాత్మకంగా మారిన బంగ్లాదేశ్‌లోని బంధువులు వద్ద చిక్కుకున్న బెంగాల్ నివాసితులకు తాను అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా మమత హామీ ఇచ్చారు. ఈ ర్యాలీలో సమాజావాదీ పార్టీ అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ సైతం పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ఆయన మోదీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: New Delhi: జగన్ పాలనలో అప్పులు ఘనం.. అభివృద్ధి శూన్యం


1971లో దేశ స్వాతంత్ర్యంలో పాల్గొన్న సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో బంగ్లాదేశ్ ప్రభుత్వం 30 శాతం రిజర్వేషన్లను కల్పిస్తుంది. ఈ 30 శాతం కోటాపై దేశవ్యాప్తంగా చాలా కాలంగా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆ విధానానికి స్వస్తి పలికి.. ప్రతిభకు పట్టం కట్టాలన్న డిమాండ్ ఆ దేశంలో రోజు రోజుకు తీవ్రమవుతుంది.

అందులోభాగంగా పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపు నిచ్చారు. ఆ ఆందోళనలో విద్యార్థులతోపాటు ప్రజలు సైతం భారీగా పాల్గొంటున్నారు. అయితే ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో ఈ అల్లర్లలో దేశవ్యాప్తంగా 104 మంది మరణించారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు బంగ్లాదేశ్‌లోని భారతీయ విద్యార్థులు వెయ్యి మంది భారత్‌లని తమ తమ స్వస్థలాలకు క్షేమంగా చేరుకున్నారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 21 , 2024 | 06:08 PM