Mamata Banerjee: నాపై గౌరవానికి కృతజ్ఞతలు: మమతా బెనర్జీ
ABN, Publish Date - Dec 11 , 2024 | 09:17 PM
'ఇండియా' కూటమి పనితీరుపై మమతా బెనర్జీ గతవారంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అవకాశం వస్తే కూటమికి సారథ్యం వహిస్తానన్నారు. ఇండియా కూటమిని తానే ఏర్పాటు చేశానని, దానిని నడపాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు.
న్యూఢిల్లీ: 'ఇండియా' (INDIA) కూటమికి సారథ్యం వహించే విషయంలో తనకు మద్దతు తెలిపిన నేతలకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కృతజ్ఞతలు తెలిపారు. పూర్బ మేదినీపూర్‌లో బుధవారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, తనపై గౌరవం, నమ్మకం వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని అన్నారు. వారంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, ఆ పార్టీలు కూడా బాగుండాలని, ఎన్డీయే కూడా బాగుండాలని కోరుకుంటుననట్టు చెప్పారు.
Railway Bill: రైల్వే సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
'ఇండియా' కూటమి పనితీరుపై మమతా బెనర్జీ గతవారంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అవకాశం వస్తే కూటమికి సారథ్యం వహిస్తానన్నారు. ఇండియా కూటమిని తానే ఏర్పాటు చేశానని, దానిని నడపాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. ఇటు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా, అటు విపక్ష కూటమిని ముందుకు తీసుకువెళ్లే విషయంలోనూ రెండు బాధ్యతలు నిర్వహించగలిగే సామర్థ్యం తనకుందన్నారు.
మమతకు మద్దతుగా పవార్, లాలూ
కాగా, ఇండియా కూటమికి మమతా బెనర్జీ సారథ్యం విషయంలో ఎన్‌సీపీ (ఎస్‌పీ)నేత శరద్ పవార్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి మద్దతు వ్యక్తమైంది. కూటమికి సారథ్యం వహించే సమర్ధత మమతా బెనర్జీకి నిశ్చయంగా ఉందని, దేశ ప్రముఖ నేతల్లో ఆమె ఒకరని పవార్ వ్యాఖ్యానించారు. పార్లమెంటుకు మమత ఎంపిక చేసి పంపిన నేతలంతా బాధ్యత కలిగిన, విధినిర్వహణకు కట్టుబడిన, ప్రజలకు బాగా సుపరిచితులైన వ్యక్తులని, ఆ దృష్ట్యా విపక్ష కూటమి సారథ్యం వహిస్తానని ఆమె అనడం సరైనదేనని అన్నారు. మమత నాయకత్వానికి లాలూ ప్రసాద్ బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. మమతా బెనర్జీకి నాయకత్వం ఇస్తే తిరిగి కేంద్రంలో తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి కూడా మమతకు మద్దతు ఉంది. టీఎంసీతో తమకు మంచి అనుబంధం ఉందని, అదే సమయంలో కాంగ్రెస్‌తోనూ తమకు మంచి సంబంధాలున్నాయని సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు. తామంతా 'ఇండియా' కూటమిలో భాగస్వాములైనందున టీఎంసీకి సపోర్ట్ చేసినంత మాత్రాన ఆ ప్రభావం కాంగ్రెస్-ఎస్‌పీ సంబధాలపై ఉండదని అన్నారు.
ఇవి కూడా చదవండి..
Parliament: పార్లమెంట్ సమావేశాలు.. నోటీసులు ఇచ్చిన ఎంపీలు..
CM Stalin: అదానీతో భేటీ అవాస్తవం.. ఆ గ్రూపుతో ఒప్పందాల్లేవ్..
For National news And Telugu News
Updated Date - Dec 11 , 2024 | 09:17 PM