Manmohan Singh’s wife: గురుశరణ్ కౌర్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
ABN, Publish Date - Dec 31 , 2024 | 06:08 PM
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆకస్మిక మృతితో.. ఆయన భార్య గురుశరణ్ కౌర్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకొంది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 31: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఆయన భార్యకు జడ్ ప్లస్ భద్రత కొనసాగించడంపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్‌కు జడ్ ప్లస్ భద్రతను ఇకపై కొనసాగించాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది.
గురుశరణ్ కౌర్ విషయంలో జెడ్ ప్లస్ కేటగిరీ కింద సీఆర్‌పీఎఫ్ రక్షణ కొనసాగిస్తుందని వెల్లడించింది. అయితే ఆమె ప్రాణాలకు ముప్పునకు సంబంధించిన అంశంపై సమీక్ష తర్వాత నిర్వహిస్తామని తెలిపింది. ఈ రక్షణలో ఉన్నవారందరికీ భద్రత కొనసాగుతుందని వెల్లడించింది. సాధారణ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
92 ఏళ్ల మన్మోహన్ సింగ్.. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో డిసెంబరు 26వ తేదీన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 1990వ దశకంలో ప్రధాని పీవీ నరసింహరావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో దేశంలో ఆర్థిక సరళీకరణ శకానికి ఆయన నాంది పలికారు.
ఆయన అంత్యక్రియలు శనివారం రాజ్‌ఘాట్ సమీపంలోని నిగంబోధ్ ఘాట్‌లో ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ఇక మన్మోహన్ సింగ్ స్మారకంపై అటు అధికార బీజేపీ, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శ, ప్రతి విమర్శలు చోటు చేసుకున్నాయి.
2019లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) రక్షణను ప్రభుత్వం ఉపసంహరించుకొంది. అనంతరం మన్మోహన్ సింగ్‌తోపాటు ఆయన భార్యకు వీఐపీ భద్రత కింద సీఆర్‌పీఎఫ్ జెడ్ ప్లస్ కల్పించింది. దీంతో న్యూఢిల్లీలోని 3, మోతీలాల్ నెహ్రూ రోడ్‌లోని వారి నివాసం వద్ద 45 మంది సాయుధ కమాండోలతో రక్షణ కల్పించారు.
Also Read: సారీ చెప్పిన సీఎం..ఎందుకంటే..
Also Read: మీ బ్యాగు తగిలించుకొన్న తీరే.. మీరేమిటో చెబుతోంది
Also Read: రహదారిపై ఆగిన కారు.. రంగంలోకి ఎద్దులు
ఇక 1988లో ప్రధాన మంత్రి రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎస్పీజీ భద్రతకు సంబంధించిన చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. Manipur: సారీ చెప్పిన సీఎం..ఎందుకంటే..ప్రధానమంత్రి భద్రత చర్యలను ఎస్పీజీ పర్యవేక్షిస్తుందన్న సంగతి తెలిసిందే. ఇక ప్రధాని నరేంద్ర మోదీకి ఎస్పీజీ భద్రత ఉంటుందన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక 2019లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీతోపాటు ప్రియాంక గాంధీకి సైతం ఎస్పీజీ భద్రతను తొలగించింది. ఆ స్థానంలో ఎస్పీజీ చట్టానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సవరణలు తీసుకు వచ్చింది. ఆ క్రమంలో సీఆర్‌పీఎఫ్ జెడ్ ప్లస్ భద్రతను ఈ ముగ్గురికి కల్పించింది.
For National news And Telugu News
Updated Date - Dec 31 , 2024 | 06:26 PM