National News: ఓ సారి వచ్చిపో నాన్న.. అమరుడైన తండ్రికి వాయిస్ మెసేజ్‌లు పంపుతున్న కుమారుడు..
ABN, Publish Date - Jun 18 , 2024 | 12:07 PM
దేశం కోసం ప్రాణాలర్పించిన తండ్రిని ఓసారి వచ్చిపో అంటూ కుమారుడు పిలవడం మానవ హృదయాలను కంటతడిపెట్టిస్తోంది. తన తండ్రి ఈలోకంలో లేరనే విషయాన్ని ఆ పసి హృదయం జీర్ణించుకోలేకపోతుంది. ఎప్పుడూ తన కోసం వచ్చే తండ్రి కొద్దిరోజులుగా ఎందుకు రావడంలేదని ఆ చిన్నారి తల్లిని ప్రశ్నిస్తోంది.
దేశం కోసం ప్రాణాలర్పించిన తండ్రిని ఓసారి వచ్చిపో అంటూ కుమారుడు పిలవడం మానవ హృదయాలను కంటతడిపెట్టిస్తోంది. తన తండ్రి ఈలోకంలో లేరనే విషయాన్ని ఆ పసి హృదయం జీర్ణించుకోలేకపోతుంది. ఎప్పుడూ తన కోసం వచ్చే తండ్రి కొద్దిరోజులుగా ఎందుకు రావడంలేదని ఆ చిన్నారి తల్లిని ప్రశ్నిస్తోంది. కనీసం తాను పిలిస్తే ఒక్కసారైనా తండ్రి వస్తాడనే ఆశతో పసి ప్రాణం ఎదురుచూస్తోంది. కానీ తన తండ్రి దేశ సేవలో 9 నెలల క్రితమే అమరుడయ్యాడనే విషయం ఆ చిన్నారికేం తెలుసు. అందుకే ఓసారి వచ్చిపో నాన్న అంటూ ప్రతిరోజు వాయిస్ మెసేజ్‌లు పంపిస్తున్నాడు ఆ పిల్లాడు. ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేస్తోంది.
Delhi: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి జమ్మూకశ్మీర్ బాధ్యతలు..
పంజాబ్‌కు చెందిన కర్నల్ మన్‌ప్రీత్‌సింగ్ 19వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా పని చేశారు. అనంత్ నాగ్‌లోని కొకెన్ నాగ్‌కు చెందిన గడోల్ అడవుల్లో ఉగ్రవాదుల్ని మట్టుపెట్టే క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గత ఏడాది సెప్టెంబర్ లో జరిగింది. మన్‌ప్రీత్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లల ఎదుటే తండ్రి అంత్యక్రియలు జరిగినా.. నాన్న ఇక రారనే విషయాన్ని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే ఆ పసి హృదయాలు తండ్రి కోసం తల్లడిల్లుతున్నాయి. ఏడేళ్ల కుమారుడు కబీర్.. నాన్నా ఒకసారి ఇంటికి రా.. తర్వాత డ్యూటీకి వెళ్లు.. అంటూ మన్‌ప్రీత్ వాడిన నంబర్‌కు వాయిస్ మెసేజ్‌లు పంపుతున్నాడు. వీడియో కాల్ చేయమని అడుగుతున్నాడు. తాను పంపిన మెసేజ్‌లు వాళ్ల అమ్మకు వినిపించకూడదని గుసగుసలాడుతూ వాటిని పంపిస్తున్నాడు.
విధి నిర్వహణలో భాగంగా మన్‌ప్రీత్‌సింగ్ అనంత్‌నాగ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనిచేశారు. ఆయా ప్రాంతాల్లో మంచిపేరు సంపాదించుకున్నారు. ఆయన అందించిన సహకారాన్ని స్థానికులు ఇప్పటికీ తలుచుకుంటూనే ఉన్నారు. పంజాబ్‌లోని తమ స్వస్థలంలో తన భర్త పిల్లల పేర్లతో రెండు మొక్కలు నాటాడని, అవి పెరిగి పెద్దయిన తర్వాత వాటిని చూడటానికి వెళ్దామని చెప్పాడని భార్య జగ్మీత్ గుర్తుచేసుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్లి చూసేందుకు ఆయన లేరంటూ మన్‌ప్రీత్‌సింగ్ భార్య కన్నీటి పర్యంతమయ్యారు. చివరిసారిగా చేసిన కాల్ గురించి మాట్లాడుతూ.. తాను ఫోన్ చేసినప్పుడు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టే ఆపరేషన్‌లో ఉన్నానని చెప్పారన్నారు. అవే చివరి మాటలు అంటూ ఉద్వేగానికి గురయ్యారు. మరోవైపు మన్‌ప్రీత్ అంత్యక్రియల సమయంలో చిన్నారి కబీర్ సైనికుడి దుస్తులు ధరించి తండ్రికి వీడ్కోలు పలికాడు. పక్కనే ఉన్న చెల్లి అన్నను అనుకరించింది. ఆ ఇద్దరికీ అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. ఆ సమయంలో తమ తండ్రికి తాము వీడ్కోలు పలుకుతున్నామని ఆ పిల్లలకు తెలియలేదు. తన తండ్రి ఇంటికి వస్తారని ఇప్పటికీ ఆ పిల్లలు ఎదురుచూస్తునే ఉన్నారు. ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది.
Chennai: ఎయిర్‌పోర్ట్‌కు మళ్లీ బాంబు బెదిరింపు.. రాత్రంతా కొనసాగిన తనిఖీలు
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latets Telugu News
Updated Date - Jun 18 , 2024 | 12:07 PM