CM visit: పారిస్ వెళ్లేందుకు సీఎంకు అనుమతి నిరాకరణ
ABN, Publish Date - Aug 03 , 2024 | 02:49 PM
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పారిస్ పర్యటనకు బ్రేక్ పడింది. ఆయన పారిస్ వెళ్లేందుకు రాజకీయ అనుమతిని కేంద్ర విదేశాంగ శాఖ నిరాకరించింది. భద్రతా కారణాల రీత్యా ఆయనకు అనుమతి నిరాకరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎంఈఏ సమాచారం పంపింది.
న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) పారిస్ (paris) పర్యటనకు బ్రేక్ పడింది. ఆయన పారిస్ వెళ్లేందుకు రాజకీయ అనుమతిని కేంద్ర విదేశాంగ శాఖ (MEA) నిరాకరించింది. భద్రతా కారణాల రీత్యా ఆయనకు అనుమతి నిరాకరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎంఈఏ సమాచారం పంపింది.
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ కలిగిన ముఖ్యమంత్రి మాన్ ఈనెల 4వ తేదీన భారత హాకీ టీమ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కోసం 3 నుంచి 9వ తేదీ వరకూ పారిస్ టూర్‌కు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎంఈఏ అనుమతిని నిరాకరిస్తూ, జడ్ల ప్లస్ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్నందున స్వల్ప వ్యవధిలో ఆయనకు ఆ స్థాయి భద్రత కల్పించడం సాధ్యం కాదని పేర్కొదంని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Civils Mains: లైబ్రరీలు క్లోజ్.. తప్పని ఇబ్బందులు
ఆస్ట్రేలియాపై 52 ఏళ్ల తర్వాత ఇండియా హాకీ టీమ్ గెలుపు
పారిస్ ఒలంపిక్స్‌లో ఆస్ట్రేలియాపై భారత హాకీ టీమ్ రికార్డు స్థాయి గెలుపు సాధించింది. 52 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా టీమ్‌పై భారత్ గెలవడం ఇదే మొదటిసారి. 3-2 తేడాతో ఆస్ట్రేలియాను ఇండియా ఓడించింది. గెలిచిన భారత్ టీమ్‌కు భగవంత్ మాన్ శుక్రవారంనాడు అభినందనలు తెలిపారు. యావద్దేశం మీ విజయాన్ని చూసి గర్విస్తోందని ఒక సందేశంలో ఆయన పేర్కొన్నారు.
For Latest News and National News Click Here
Updated Date - Aug 03 , 2024 | 02:49 PM