Minister: పొంగల్ గిఫ్ట్‌తో చీర, ధోవతి కూడా..
ABN, Publish Date - Nov 26 , 2024 | 11:39 AM
కుటుంబ కార్డులకు జనవరి మొదటి వారం నుంచి రేషన్ దుకాణాల ద్వారా పొంగల్(Pongal) గిఫ్ట్‌తో చీర, ధోవతి పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి గాంధీ(Minister Gandhi) పేర్కొన్నారు. ఈ అంశంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
- మంత్రి గాంధీ
చెన్నై: కుటుంబ కార్డులకు జనవరి మొదటి వారం నుంచి రేషన్ దుకాణాల ద్వారా పొంగల్(Pongal) గిఫ్ట్‌తో చీర, ధోవతి పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి గాంధీ(Minister Gandhi) పేర్కొన్నారు. ఈ అంశంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఉచిత ధోవతి, చీరల పంపిణీ పథకానికి సంబంధించి నేత కార్మికులు తయారీ పనులు మూడు నెలల నుంచే ప్రారంభించారని తెలిపారు. 12,040 చేనేత మగ్గాలు, 54,190 మరమగ్గాల్లో నేత కార్మికుల సహకార సంఘాల సభ్యులను ప్రోత్సహించేలా వస్త్ర తయారీ ఆర్డర్లు అప్పగించినట్లు ఆయన తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Viral fevers: విజృంభిస్తున్న వైరల్ జ్వరాలు.. కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
అంతేకాకుండా, నేత కార్మికుల జీవనాధారం మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఇస్తోందని, ఉచిత చీర, ధోవతి, యూనిఫాం పథకాలను నేత కార్మికులకు వర్తింపజేయలేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. పొంగల్ సందర్భంగా ఉచిత చీర, ధోవతితోపాటు చక్కెర, ఇతర సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీచేసేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Shamshabad: బ్యాంకాక్ నుంచి బ్యాగుల్లో పాములు
ఈవార్తను కూడా చదవండి: Goshmahal: మలక్‌పేటకు గోషామహల్ స్టేడియం
ఈవార్తను కూడా చదవండి: Solar Panels: సోలార్ ప్యానల్స్‌తో మేలుకన్నా హాని ఎక్కువ
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు రంగం సిద్ధం.. పూర్తి వివరాలు ఇవే..
Read Latest Telangana News and National News
Updated Date - Nov 26 , 2024 | 11:39 AM