Modi 3.0 Cabinet: మోదీ 3.0 కేబినెట్‌లో వీరికే ఛాన్స్!.. ఈసారి ఏపీ, తెలంగాణ, బీహార్ నుంచి..
ABN, Publish Date - Jun 09 , 2024 | 08:08 AM
నేడు (జూన్ 9న) దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ(Narendra Modi) మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అందరీ దృష్టి కూడా మంత్రివర్గంపై(Cabinet) పడింది. ఎవరికీ మంత్రి పదవులు దక్కనున్నాయి. ఎవరు మోదీ 3.0 క్యాబినెట్(Modi 3.0 Cabinet)లో చోటు దక్కించుకోనున్నారనే ఆసక్తి మొదలైంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
నేడు (జూన్ 9న) దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ(Narendra Modi) మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అందరీ దృష్టి కూడా మంత్రివర్గంపై(Cabinet) పడింది. ఎవరికీ మంత్రి పదవులు దక్కనున్నాయి. ఎవరు మోదీ 3.0 క్యాబినెట్(Modi 3.0 Cabinet)లో చోటు దక్కించుకోనున్నారనే ఆసక్తి మొదలైంది. అయితే ప్రస్తుతం వచ్చిన సమాచారం ప్రకారం ఆదివారం రాత్రి 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో మోదీతోపాటు మరో 30 మందికి పైగా మంత్రిమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది.
వారిలో ఎన్‌డీఏలోని భాగస్వామ్య పార్టీలకు చెందిన 20 మందికిపైగా మంత్రులు, రాష్ట్ర మంత్రులు (స్వతంత్ర) బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. దీంతో మొత్తం కేబినెట్‌లో మంత్రుల సంఖ్య 78 నుంచి 81కి చేరుతుందని అంచనా. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల వారీగా పలువురికి అవకాశం దక్కుతుందని తెలిసింది. ఆ జాబితా వివరాలను ఇక్కడ చుద్దాం.
బీహార్ నుంచి
జితన్ రామ్ మాంఝీ (హెచ్ఏఎమ్)
లాలన్ సింగ్ (జేడీయూ)
సునీల్ కుమార్ (జేడీయూ)
కౌశలేంద్ర కుమార్ (జేడీయూ)
రామ్‌నాథ్ ఠాకూర్ (జేడీయూ)
సంజయ్ ఝా (జేడీయూ)
రాజీవ్ ప్రతాప్ రూడీ (బీజేపీ)
సంజయ్ జైస్వాల్ (బీజేపీ)
నిత్యానంద రాయ్ (బీజేపీ)
చిరాగ్ పాశ్వాన్ (ఎల్జేపీ)
తెలంగాణ నుంచి
కిషన్ రెడ్డి (బీజేపీ)
ఈటల రాజేందర్ (బీజేపీ)
డీకే అరుణ (బీజేపీ)
డి అరవింద్ (బీజేపీ)
బండి సంజయ్ (బీజేపీ)
ఆంధ్రప్రదేశ్ నుంచి
దగ్గుబాటి పురందేశ్వరి (బీజేపీ)
కింజరాపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ)
హరీష్ బాలయోగి(టీడీపీ)
దగ్గుమళ్ల ప్రసాద్ (టీడీపీ)
జమ్మూ కశ్మీర్ నుంచి
జితేంద్ర సింగ్ (బీజేపీ)
జుగల్ కిషోర్ శర్మ (బీజేపీ)
ఉత్తర ప్రదేశ్ నుంచి
రాజ్‌నాథ్ సింగ్ (బీజేపీ)
అనుప్రియా పటేల్ (మీర్జాపూర్ నుంచి అప్నా దళ్ చీఫ్)
జయంత్ చౌదరి (రాష్ట్రీయ లోక్ దళ్ చీఫ్)
జితిన్ ప్రసాద్ (బీజేపీ)
కర్ణాటక నుంచి
హెచ్‌డీ కుమారస్వామి (జేడీఎస్)
ప్రహ్లాద్ జోషి (బీజేపీ)
బసవరాజ్ బొమ్మై (బీజేపీ)
గోవింద్ కర్జోల్ (బీజేపీ)
పిసి మోహన్ (బీజేపీ)
మహారాష్ట్ర నుంచి
ప్రతాపరావు జాదవ్ (బీజేపీ)
నితిన్ గడ్కరీ (బీజేపీ)
పీయూష్ గోయల్ (బీజేపీ)
మధ్యప్రదేశ్ జ్యోతిరాదిత్య సింధియా (బీజేపీ)
శివరాజ్ సింగ్ చౌహాన్ (బీజేపీ)
ఒడిశా నుంచి
ధర్మేంద్ర ప్రధాన్ (బీజేపీ)
మన్మోహన్ సమల్ (బీజేపీ)
రాజస్థాన్ గజేంద్ర సింగ్ షెకావత్ (బీజేపీ)
దుష్యంత్ సింగ్ (బీజేపీ)
అసోం నుంచి
నార్త్ ఈస్ట్ సర్బానంద సోనోవాల్ (బీజేపీ)
బిజులీ కలితా మేధి (బీజేపీ)
కిరణ్ రిజిజు (బీజేపీ)
బిప్లబ్ దేవ్ (బీజేపీ)
కేరళ నుంచి
సురేష్ గోపి (బీజేపీ)
బెంగాల్ శంతును ఠాకూర్ (బీజేపీ)
ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత ఆయా రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందులో హోం, రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల వంటి ముఖ్యమైన మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వహించే మంత్రులు కూడా ఉంటారు. ఈ మంత్రిత్వ శాఖలన్నీ భాజపాతోనే ఉంటాయని తెలిసింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని మూడో విడత కేబినెట్‌లో చాలా తక్కువ మంది సభ్యులు ఒకటి కంటే ఎక్కువ పోర్ట్‌ఫోలియోలను కలిగి ఉంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. టీడీపీకి నాలుగు, జేడీయూకు రెండు మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నప్పటికీ ఇవాళ ప్రమాణస్వీకారం చేస్తారా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు.
ఇది కూడా చదవండి:
Gold and Silver Rates: పెరిగిన బంగారం, వెండి ధరలకు చెక్.. భారీగా తగ్గిన రేట్లు
Read Latest National News and Telugu News
Updated Date - Jun 09 , 2024 | 08:34 AM