ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok sabha Elections 2024: భయపడొద్దు, పారిపోవద్దు.. రాహుల్ నామినేషన్‌పై మోదీ

ABN, Publish Date - May 03 , 2024 | 04:14 PM

రాయబరేలి నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభ్యర్థిత్వం ఖరారు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. అమేథీలో పోటీకి బయపడే ఆయన రాయబరేలి వైపు పరిగెత్తుతున్నారని వ్యాఖ్యానించారు.

దుర్గాపూర్: రాయబరేలి నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) అభ్యర్థిత్వం ఖరారు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తొలిసారి స్పందించారు. అమేథీలో పోటీకి బయపడే ఆయన రాయబరేలి వైపు పరిగెత్తుతున్నారని వ్యాఖ్యానించారు.


''ఎన్నికల్లో పాటీ చేయడానికి ఆ పార్టీ (కాంగ్రెస్) ప్రముఖ నేతలు భయపడుతున్నారని, ఆమె (సోనియాగాంధీ) పోటీకి దూరంగా వెళ్తున్నారని పార్లమెంటులో అప్పుడే చెప్పాను. ఆమె రాజస్థాన్‌ వెళ్లి అక్కడ నుంచి రాజ్యసభకు వచ్చారు. షెహజాదా (రాహుల్) వయనాడ్‌ సీటు కోల్పోనున్నారని, వయనాడ్‌లో పోలింగ్ పూర్తి కాగానే, ఆయన మరో సీటు వెతుక్కుంటారని జోస్యం చెప్పాను. అమేథీలో పోటీకి భయపడుతున్నందనే రాయబరేలి పారిపోతున్నారని చెప్పాను. ఎవరూ భయపడవద్దని వాళ్లు (కాంగ్రెస్) చెబుతుంటారు. భయపడ వద్దు, పారిపోవద్దు అని ఇవాళ వారికి నేను చెబుతున్నాను'' అని పశ్చిమబెంగాల్‌ లోని బర్దమాన్‌లో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ మోదీ అన్నారు.

Lok Sabha Elections 2024: రాయబరేలి నుంచి రాహుల్ నామినేషన్


రాహుల్ నామినేషన్

అమేథీ, రాయబరేలి నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎవరు బరిలోకి దిగుతారనే సస్పెన్స్‌కు ఆ ఆపార్టీ శుక్రవారంనాడు తెరదించింది. రాయబరేలి అభ్యర్థిగా రాహుల్‌ను, అమేథి అభ్యర్థిగా గాంధీ కుటుంబం సన్నిహితుడు కిషోరి లాల్ శర్మ పేరును ప్రకటించింది. ఆ వెంటనే రాయబరేలి నుంచి రాహుల్ నామినేషన్ వేశారు. సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, రాబర్ట్ వాద్రా సమక్షంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రాహుల్ నామినేషన్ వేశారు. రాహుల్‌కు చారిత్రాత్మకంగా, భావోద్వేగాల పరంగా అమేథీ కంటే రాయబరేలి సురక్షిత నియోజకవర్గంగా పార్టీ అధిష్ఠానం సుదీర్ఘ మంతనాల అనంతరం తుది నిర్ణయానికి వచ్చింది. సోనియాగాంధీ సైతం ఇటీవల తన ఫేర్‌ఫెల్ మెసేజ్‌లో, సుదీర్ఘ కాలం రాయబరేలి నియోజకవర్గం తనతోనే ఉందని, తన కుటుంబానికి ప్రజలు వెన్నుదన్నుగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. వయోభారం, ఆరోగ్య సమస్యల కారణంగా తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 03 , 2024 | 04:16 PM

Advertising
Advertising