ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Modi Cabinet: పరుగు ప్రారంభించిన 3.0 సర్కారు

ABN, Publish Date - Jun 11 , 2024 | 04:17 AM

భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం కోసం ఒకేసారి 71మందికి తన కేబినెట్‌లో ప్రధాని మోదీ చోటు కల్పించారు. ప్రమాణం చేసిన రెండోరోజే కేంద్రప్రభుత్వంలోని కీలక శాఖలు పరుగు ప్రారంభించేశాయి. రాబోయే వంద రోజుల కోసం కార్యాచరణ ప్రణాళిలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి.

  • వచ్చే మూడు నెలలకు లక్ష్యాల నిర్దేశం

  • అగ్నిపథ్‌ను సమీక్షించనున్న రక్షణశాఖ

  • జూలై నుంచి కొత్త క్రిమినల్‌ చట్టాల అమలు

న్యూఢిల్లీ, జూన్‌ 10: భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం కోసం ఒకేసారి 71మందికి తన కేబినెట్‌లో ప్రధాని మోదీ చోటు కల్పించారు. ప్రమాణం చేసిన రెండోరోజే కేంద్రప్రభుత్వంలోని కీలక శాఖలు పరుగు ప్రారంభించేశాయి. రాబోయే వంద రోజుల కోసం కార్యాచరణ ప్రణాళిలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి. ఉదాహరణకు, అగ్నిపథ్‌ పథకాన్ని సమీక్షించి, అందులో అవసరమైన మార్పులను చేసే పనిని రక్షణ శాఖ ప్రారంభించేసింది. ఎగుమతుల రంగంలో రక్షణ పరికరాలకు మరింత ప్రచారం కల్పించేలా కొత్త వ్యవస్థకు రూపకల్పన చేస్తోంది. భారత్‌ నుంచి ఆయుధాలు, మందుగుండు కొంటున్న మిత్రదేశాలకు సహాయకంగా కార్పస్‌ ఫండ్‌ను ఏర్పాటుచేయనున్నారు. రక్షణ ఆయుధగారం అమ్ములపొదిలోకి అదనంగా కే9 వజ్రా ఆర్టిలరీ తుపాకులు, విదేశీ జెట్లలో వాడే ఇంజన్లు చేరనున్నాయి. నౌక దళం కోసం కొంటున్న రఫెల్‌ ఎమ్‌ ఫైటర్‌ జెట్లపై చివరి దశ చర్చలను వెంటనే ప్రారంభించాలని రక్షణ శాఖ నిర్ణయించింది. రక్షణ పరికరాల అభివృద్ధి సంస్థ అయిన డీఆర్‌డీవోలో సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నారు.

అంతర్గత భద్రత: కొత్త క్రిమినల్‌ చట్టాలను జూలై ఒకటి నుంచి అమలుచేసేందుకు కేంద్ర హోం శాఖ సిద్ధమవుతోంది. సెప్టెంబరు 30 లోగా సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చినట్టుగా జమ్ము, కశ్మీర్‌లకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం హోంశాఖ ముందున్న ముఖ్యమైన సవాల్‌. మణిపూర్‌ జాతి కలహాలను అదుపులోకి తీసుకురావడం మరో క్లిష్టమైన లక్ష్యం. ఈ పనులన్నీ మూడు నెలల్లో పూర్తయ్యేలా హోం శాఖ ప్రణాళికలు రచిస్తోంది.

సుపరిపాలన: జీవన సౌకర్యాల మెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. పౌర సమస్యల పరిష్కారాన్ని మరింత సులభతరం చేస్తూ కొత్తగా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటుచేయనున్నారు. ప్రక్రియలోని జాప్యాన్ని, ఉద్యోగుల పింఛనులోని సమస్యలను నివృత్తి చేస్తూ.. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉమ్మడి పెన్షన్‌ నిబంధనలను ప్రవేశపెట్టనున్నారు. రక్షణ శాఖను దీనినుంచి మినహాయించారు. ప్రభుత్వ సేవల పూర్తిస్థాయి డిజిటలైజేషన్‌, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థల్లో ఈ-ఆఫీ్‌సను ప్రవేశపెట్టనున్నారు.


విద్య, నైపుణ్యం: విద్యారంగంపై మండలస్థాయి నుంచీ సమగ్ర పర్యవేక్షణకు వీలుగా పాఠశాల విద్య స్థాయిలో డిజిటలైజేషన్‌ను సాధించడం కేంద్ర విద్యాశాఖ పెట్టుకున్న అతి ముఖ్య లక్ష్యం. ఇక రెండో ప్రాధాన్య లక్ష్యం డ్రాపవుట్ల నివారణ. స్కూల్‌బోర్డుల స్థాయిలో సమగ్ర మూల్యాంకన విధానాలను ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయం: సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న విత్తన బిల్లులను క్లియర్‌ చేయడాన్ని వ్యవసాయ శాఖ ప్రథమ లక్ష్యంగా ప్రకటించింది. దీనికోసం రాష్ట్రీయ కిసాన్‌ వికాస్‌ యోజనకు వచ్చే మూడునెలల్లో రూపకల్పన చేయనుంది.

పంచాయతీరాజ్‌ శాఖ: ఇంటి కప్పు పదిమీటర్లు ఎత్తు ఉండేలా పక్కా గృహాలను ఉచితంగా పేదలకు కట్టి ఇవ్వాలని పంచాయతీరాజ్‌ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పీఎమ్‌ సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ పథకం కింద ఈ పనులు చేపట్టనున్నారు.

కీలక నియామకాలు: కొత్త ఆర్మీ చీఫ్‌ను త్వరలోనే కేంద్ర ప్రభుత్వ నియమించనుంది. ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే పదవీకాలం ఇప్పటికే ముగిసినా, ఆయన సర్వీసును మరో నెలరోజులకు పొడిగించారు. కొత్త ఆర్మీ చీఫ్‌ ఎంపిక ప్రక్రియను వచ్చే మూడు నెలల్లో పూర్తి చేయనున్నారు.

ఇతర ముఖ్యమైన నిర్ణయాలు: కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గబ్బా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా వచ్చే ఆగస్టు వరకు కొనసాగనున్నారు. ఐటీ చీఫ్‌ తపన్‌ డేకా పదవీకాలం జూన్‌ 30తో ముగుస్తోంది. తపన్‌ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిఉంది.

రాయబారులు: అమెరికా, ఫ్రాన్స్‌తోపాటు ఐక్యరాజ్యసమితిలో పనిచేసేందుకు కొత్త రాయబారులను కొత్తగా ప్రకటించనున్నారు. విదేశాంగశాఖ కొత్త కార్యదర్శిని అక్టోబరు నాటికి నియమిస్తారు.

Read more!

Updated Date - Jun 11 , 2024 | 04:17 AM

Advertising
Advertising