ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Result: వారణాసిలో మోదీ హ్యాట్రిక్ సాధించినా...

ABN, Publish Date - Jun 04 , 2024 | 06:35 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మరోసారి విజయం సాధించారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన రికార్డును సొంతం చేసుకున్నారు. మోదీ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌పై 1,52,513 ఓట్లు ఆధిక్యంతో గెలుపొందారు.

వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి (Varanasi) లోక్‌సభ నియోజకవర్గం నుంచి మరోసారి విజయం సాధించారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన రికార్డును సొంతం చేసుకున్నారు. మోదీ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌పై 1,52,513 ఓట్లు ఆధిక్యంతో గెలుపొందారు. మోదీకి 6,12,970 ఓట్లు పోల్ కాగా, అజయ్ రాయ్‌కి 4,60,457 ఓట్లు వచ్చాయి. బీజేపీ 33,766 ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. అయితే, 2019లో పోల్చుకుంటే ఈసారి మోదీ ఓట్ల ఆధిక్యత తగ్గింది. నాటి సార్వత్రిక ఎన్నికల్లో మోదీ 4.79 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యత సాధించారు. ఆ ప్రకారం సుమారు 3 లక్షల ఆధికత్య ఈసారి మోదీకి తగ్గింది.


మోదీ 2019లో 63.6 శాతం ఓట్లు సాధించగా, 2014లో 56.37 శాతంతో 3.72 లక్షల ఆధిక్యంతో గెలిచారు. ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించగా, అజయ్ రాయ్ మూడో స్థానంలో నిలిచారు. ఆసక్తికరంగా ఈసారి (2024) ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతలైన అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్ కంటే మోదీ 'విన్నింగ్ మార్జిన్' తక్కువగా ఉంది.

Updated Date - Jun 04 , 2024 | 06:41 PM

Advertising
Advertising