ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kerala: రంగంలోకి నేవీ..!!

ABN, Publish Date - Jul 30 , 2024 | 01:52 PM

వర్షాలతో కేరళలో కొండ చరియలు విరిగి పడుతూనే ఉన్నాయి. వయనాడులో పరిస్థితి దయనీయంగా మారింది. సహాయక చర్యల కోసం ఆర్మీ రంగంలోకి దిగింది. ఇంతలో భారత వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ ఇచ్చింది. వయనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రెడ్ అలర్ట్ కూడా జారీచేసింది. వయనాడు జిల్లా మెప్పాడిలో రెండు చోట్ల కొండ చరియలు విరిగిపడి వరద ప్రవహం ఏరులై పారింది.

Kerala Rains

వయనాడు: వర్షాలతో కేరళలో కొండ చరియలు విరిగి పడుతూనే ఉన్నాయి. వయనాడులో (Wayanadu) పరిస్థితి దయనీయంగా మారింది. సహాయక చర్యల కోసం ఆర్మీ రంగంలోకి దిగింది. ఇంతలో భారత వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ ఇచ్చింది. వయనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రెడ్ అలర్ట్ కూడా జారీచేసింది. వయనాడు జిల్లా మెప్పాడిలో రెండు చోట్ల కొండ చరియలు విరిగిపడి వరద ప్రవహం ఏరులై పారింది. సహాయక చర్యలు కొనసాగుతోన్న వేళ.. ఈ రోజు కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కోజికోడ్, మలప్పురం, కాసర్ గఢ్ జిల్లాలతోపాటు వయనాడుకు రెడ్ అలర్ట్ జారీచేసింది. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పలక్కాడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది. కొండచరియలు విరిగిపడటంతో వయనాడులో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఐదారు గ్రామాల్లో వరద నీరు పోటెత్తింది. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేసింది. చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. మహా వృక్షాలు కూడా నెలకొరిగాయి.


మారిన రూపురేఖలు

మెప్పాడిలోని ముండక్కై, చూర్మాల, అట్టమాల, నూల్‌పుజా గ్రామాల పరిస్థితి దారుణంగా మారింది. నిన్నటి వరకు ఆ గ్రామాలు అందంగా ఉండేవి. మంగళవారం ఉదయం నుంచి వాటి రూపు రేఖలు మారిపోయాయి. వరద నీటితో ఇప్పటి వరకు 54 మంది వరకు చనిపోయారు. వివిధ ఆస్పత్రుల నుంచి 24 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. 70 మందికి పైగా గాయపడ్డారు. వారికి మెరుగైన వైద్యం అందజేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి వీణ జార్జ్ ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యారు. నౌకాదళ సిబ్బంది కూడా పాల్గొంటారని వివరించారు.


హెలికాప్టర్లు

వయనాడులో కొండచరియల బీభత్సం సృష్టించడంతో ఆర్మీ 225 మంది సిబ్బందిని పంపించింది. వీరిలో వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. ఎయిర్ ఫోర్స్‌కు చెంది ఎంఐ-17, ఏఎల్‌హెచ్ హెలికాప్టర్ల సేవలను వినియోగిస్తున్నారు. కొండచరియల విరిగిపడటంతో మలప్పురంలోని నీలంబర్ ప్రాంతానికి వెళ్లే వంతెన కొట్టుకొని పోయింది.


Read More National News
and Latest Telugu News

Updated Date - Jul 30 , 2024 | 01:52 PM

Advertising
Advertising
<