మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandigarh Airport: కంగనకు చెంపదెబ్బ

ABN, Publish Date - Jun 07 , 2024 | 03:44 AM

చండీగఢ్‌ విమానాశ్రయంలో సీఐఎ్‌సఎఫ్‌కు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్‌ తనను కొట్టారని బాలీవుడ్‌ నటి, బీజేపీ తరఫున తాజా ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి ఎన్నికైన ఎంపీ కంగనా రనౌత్‌ ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఢిల్లీకి వెళ్లటం కోసం తాను చండీగఢ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, భద్రతాపరమైన తనిఖీల అనంతరం సీఐఎ్‌సఎఫ్‌ కానిస్టేబుల్‌ కుల్వీందర్‌ కౌర్‌ తనతో వాగ్వాదానికి దిగి చెంపదెబ్బ కొట్టారని కంగన తెలిపారు.

Chandigarh Airport: కంగనకు చెంపదెబ్బ

  • చండీగఢ్‌ విమానాశ్రయంలో ఘటన

  • ఎంపీపై చేయి చేసుకున్న మహిళా కానిస్టేబుల్‌

న్యూఢిల్లీ, జూన్‌ 6: చండీగఢ్‌ విమానాశ్రయంలో సీఐఎ్‌సఎఫ్‌కు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్‌ తనను కొట్టారని బాలీవుడ్‌ నటి, బీజేపీ తరఫున తాజా ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి ఎన్నికైన ఎంపీ కంగనా రనౌత్‌ ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఢిల్లీకి వెళ్లటం కోసం తాను చండీగఢ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, భద్రతాపరమైన తనిఖీల అనంతరం సీఐఎ్‌సఎఫ్‌ కానిస్టేబుల్‌ కుల్వీందర్‌ కౌర్‌ తనతో వాగ్వాదానికి దిగి చెంపదెబ్బ కొట్టారని కంగన తెలిపారు.

ఈ మేరకు జరిగిన ఘటన గురించి ఆమె ఎక్స్‌లో వెల్లడించారు. ఎందుకు కొట్టావని అడిగితే తాను రైతుల పోరాటాన్ని సమర్థిస్తానని కుల్వీందర్‌ చెప్పారన్నారు. తాను బాగానే ఉన్నానని, అయితే, పంజాబ్‌లో పెరుగుతున్న హింసాకాండ, ఉగ్రవాదం ఆందోళన కలిగిస్తోందని కంగన పేర్కొన్నారు. కాగా, రైతుల ఉద్యమంపై కంగన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహంతోనే కుల్వీందర్‌ ఆమెపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కంగన ఢిల్లీలో సీఐఎ్‌సఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కుల్వీందర్‌ కౌర్‌ను అధికారులు విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. కుల్వీందర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐఎ్‌సఎ్‌ఫను(CISF) జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖాశర్మ కోరారు.

Updated Date - Jun 07 , 2024 | 03:44 AM

Advertising
Advertising