Kamal Nath: మాజీ సీఎం కమల్‌నాథ్ నివాసంపై పోలీస్ రెయిడ్స్
ABN, Publish Date - Apr 15 , 2024 | 04:09 PM
కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ నివాసంపై రాష్ట్ర పోలీసులు సోమవారంనాడు దాడులు జరిపారు. కమల్‌నాథ్ ప్రైవేట్ సెక్రటరీ ఆర్కే మిగ్లానిని పోలీస్ టీమ్ ప్రస్తుతం ఇంటరాగేట్ చేస్తోంది. బీజేపీ అభ్యర్థి వివేక్ బంటీ సాహు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమల్‌నాథ్ నివాసంపై పోలీసులు ఈ దాడులు జరిపారు.
భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ (Kamal Nath) నివాసంపై రాష్ట్ర పోలీసులు సోమవారంనాడు దాడులు జరిపారు. కమల్‌నాథ్ ప్రైవేట్ సెక్రటరీ ఆర్కే మిగ్లానిని పోలీస్ టీమ్ ప్రస్తుతం ఇంటరాగేట్ చేస్తోంది. బీజేపీ అభ్యర్థి వివేక్ బంటీ సాహు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమల్‌నాథ్ నివాసంపై పోలీసులు ఈ దాడులు జరిపారు. తనపై ఒక అభ్యంతరకరమైన, నకిలీ వీడియో విడుదల చేసేందుకు జర్నలిస్టులకు కమల్‌నాథ్ ప్రైవేటు సెక్రటరీ రూ.20 లక్షలు ఇవ్వచూపారంటూ సాహూ తన ఫిర్యాదులో ఆరోపించారు. సాహు ఫిర్యాదుతో మిగ్లానిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Congress: కట్టుదిట్టమైన ఈసీ నిఘా.. రాహుల్ హెలికాప్టర్ తనిఖీ
సాహు ఫిర్యాదు ఆదారంగా మిగ్లానీ నివాసంలో పోలీసులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఛింద్వారాలోని షికార్‌పూర్‌లో ఉన్న కమల్‌నాథ్ నివాసంలోనూ సోదాలు జరిపారు. కమల్‌నాథ్ కుమారుడు, కాంగ్రెస్ నేత నకుల్ నాథ్ ఈ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 15 , 2024 | 04:09 PM