ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Uttar Pradesh: ఇప్పుడే అసలు సినిమా మొదలైంది.. గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ మృతిపై సోదరుడు సంచలన ప్రకటన..

ABN, Publish Date - Apr 02 , 2024 | 08:34 AM

గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ (Mukthar Ansari) సోదరుడు, ఘాజీపూర్ ఎంపీ అప్జల్ అన్సారీ ఆయన అన్న మృతిపై సంచలన ప్రకటన చేశారు. ముఖ్తార్ అన్సారీ కథ సుఖాంతమైందని ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం ఆలోచిస్తోందని అఫ్జల్ పేర్కొన్నారు.

గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ (Mukthar Ansari) సోదరుడు, ఘాజీపూర్ ఎంపీ అప్జల్ అన్సారీ ఆయన అన్న మృతిపై సంచలన ప్రకటన చేశారు. ముఖ్తార్ అన్సారీ కథ సుఖాంతమైందని ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం ఆలోచిస్తోందని అఫ్జల్ పేర్కొన్నారు. ముఖ్తార్ అన్సారీ మా మధ్యలో లేరనేది నిజమే అయినప్పటికీ.. కొందరు నేరస్తులను కాపాడేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలోని అధికారులు తన సోదరుడిని హత్య చేశారని ఆరోపించారు. రాజ ధర్మం హత్యకు గురైందని, దానిని ఎవరైనా ధైర్యసాహసంగా భావిస్తే పెద్ద తప్పవుతుందన్నారు. డాక్టర్లు, జైలు అడ్మినిస్ట్రేషన్, ఎల్ఐయూ, ఎస్టీఎఫ్ కలిసి పక్కా ప్రణాళికతో ముఖ్తార్ అన్సారీ హత్యకు పాల్పడ్డారని అఫ్జల్ తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు విచారణ కోసం ఆయన అస్థికలను భద్రపరిచినట్లు తెలిపారు. ముఖ్తార్ మృతదేహాన్ని 20 ఏళ్ల తర్వాత కూడా పరీక్షించే విధంగా ఖననం చేసినట్లు తెలిపారు. అందుకే ముఖ్తార్ అన్సారీ మృతితో కథ ముగిసినట్లు కాదని, ఇప్పుడే అసలు సినిమా మొదలైందని అప్జల్ అన్నారీ చెప్పారు.

Sumalatha: ఇంకా టిక్కెట్ ఇవ్వలేదు.. త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తా.. సుమలత కామెంట్స్..

అధికారులపై ఆరోపణలు..

ముఖ్తార్ అన్సారీ అంతిమయాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చారని, ఇది చూసి అధికారులు ఉలిక్కిపడ్డారని అప్జల్ అన్నారీ తెలిపారు. అంతిమయాత్ర త్వరగా ముగించాలని అధికారులు తమను బెదిరించారని ఆరోపించారు. అంతిమయాత్ర సమయంలోనే ఓ వ్యక్తి ఎలాంటి వాడో తెలుస్తుందని, ముఖ్తార్ అంతిమయాత్ర దీనికి నిదర్శనమన్నారు. తన సోదరుడి మృతి అంశాన్ని ఇక్కడితో వదిలిపెట్టేది లేదని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.

Elections 2024: ఆర్థిక మంత్రులు లోక్ సభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయరు.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 02 , 2024 | 08:53 AM

Advertising
Advertising