Mumbai : కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం
ABN, Publish Date - Aug 27 , 2024 | 04:57 AM
మహారాష్ట్రలో ప్రారంభించిన 8 నెలలకే ఛత్రపతి శివాజీ మహరాజ్ 35 అడుగుల భారీ విగ్రహం కుప్పకూలింది.
ముంబైలో ప్రారంభించిన 8 నెలలకే నేలమట్టం
ముంబై, ఆగస్టు 26: మహారాష్ట్రలో ప్రారంభించిన 8 నెలలకే ఛత్రపతి శివాజీ మహరాజ్ 35 అడుగుల భారీ విగ్రహం కుప్పకూలింది. ఈ ఘటన సోమవారం సింధుదుర్గ్ జిల్లా మాల్వాన్‌లో జరిగింది. గత సంవత్సరం డిసెంబరు 4న నౌకదళ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఈ విగ్రహాన్ని మాల్వాన్‌లోని రాజ్‌కోట్ కోటలో ప్రారంభించారు.
గత రెండు మూడు రోజులుగా జిల్లాలో ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయని, బలమైన గాలుల ధాటికి విగ్రహం నేలమట్టం అయినట్లు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కాగా, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. అయితే, శివాజీ విగ్రహాన్ని సాధ్యమైనంత త్వరగా తిరిగి అక్కడే ఏర్పాటు చేస్తామని సీఎం శిందే తెలిపారు.
Updated Date - Aug 27 , 2024 | 04:57 AM