ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

National: నీట్‌-పీజీ వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ

ABN, Publish Date - Aug 10 , 2024 | 04:37 AM

ఆదివారం జరగాల్సిన నీట్‌-పీజీ పరీక్షను వాయిదా వేయడానికి శుక్రవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షలు రాయాల్సిన నగరాలను అభ్యర్థులకు ఇప్పటికే కేటాయించారని, చివరి నిమిషంలో వాయిదా వేస్తే చాలా అవస్థలు పడుతారని తెలిపింది.

  • అయిదుగురి కోసం 2 లక్షల మందిని

  • ఇబ్బంది పెట్టలేమని వ్యాఖ్య.. రేపే పరీక్ష

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఆదివారం జరగాల్సిన నీట్‌-పీజీ పరీక్షను వాయిదా వేయడానికి శుక్రవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షలు రాయాల్సిన నగరాలను అభ్యర్థులకు ఇప్పటికే కేటాయించారని, చివరి నిమిషంలో వాయిదా వేస్తే చాలా అవస్థలు పడుతారని తెలిపింది.

అయిదుగురు విద్యార్థుల కోసం 2లక్షల మంది భవిష్యత్తును ఇబ్బందుల్లోకి నెట్టలేమని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ పార్డీవాలా, జస్టిస్‌ మనోజ్‌మిశ్రాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వచ్చి పరీక్షలు వాయిదా వేయాలని అడుగుతున్నారు.

ఇలాంటి పరీక్షను ఎలా వాయిదా వేస్తాం? ఒకవేళ వాయిదా వేస్తే 2లక్షల మంది విద్యార్థులు, 4లక్షల మంది తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటారు’’ అని వ్యాఖ్యానించింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ హెగ్డే వాదనలు వినిపిస్తూ తగినన్ని పరీక్షా కేంద్రాలు లేకపోవడంతో ఉదయం ఒక సెట్‌ వారికి, సాయంత్రం మరొక సెట్‌ వారికి పరీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు.

ఏకరూపత, నిష్పక్షపాతం ఉండేలా చూసేందుకే పరీక్షను వాయుదా వేయాలని కోరినట్టు చెప్పారు. పరీక్షలు రాసేందుకు కేటాయించిన నగరాలను జులై 31న ప్రకటించగా, సెంటర్ల వివరాలను గురువారమే వెల్లడించారని, దూరప్రాంతాల్లో సెంటర్లు ఉన్న విద్యార్థులు వెళ్లడానికి సమయం చాలదని, పరీక్షను వాయిదా వేయాలని కోరారు.

Updated Date - Aug 10 , 2024 | 04:37 AM

Advertising
Advertising
<