Naxalites: రెండు మొబైల్ టవర్లను తగులబెట్టిన నక్సల్స్.. ఆ నేతలకు బెదిరింపులు
ABN, Publish Date - May 27 , 2024 | 11:33 AM
నక్సలైట్లు(Naxalites) ఆదివారం అర్ధరాత్రి మరో దారుణమైన ఉదంతానికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో నిర్మాణంలో ఉన్న రెండు బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌లకు నిప్పు పెట్టారు. ఆ తర్వాత నక్సలైట్లు పలు బ్యానర్లు, పోస్టర్లను కూడా అక్కడ వేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందనే వివరాలను ఇప్పుడు చుద్దాం.
నక్సలైట్లు(Naxalites) ఆదివారం అర్ధరాత్రి మరో దారుణమైన ఉదంతానికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో నిర్మాణంలో ఉన్న రెండు బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌లకు నిప్పు పెట్టారు. ఆ తర్వాత నక్సలైట్లు పలు బ్యానర్లు, పోస్టర్లను కూడా అక్కడ వేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) నారాయణపూర్(Narayanpur) జిల్లాలోని చమేలీ గ్రామం పరిధిలో చోటుచేసుకుంది. ఛోటాదొంగర్ పోలీస్ స్టేషన్‌కు 4 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం. దీంతో ఆ ప్రాంతంలో జిల్లా పోలీసు బలగాలు, ఐటీబీ అధికారులు సోదాలు చేస్తున్నాయి. టవర్‌ను త్వరలో ప్రారంభించబోతున్నారని తెలిసి నక్సలైట్లు దానికి నిప్పుపెట్టారని భద్రతా బలగాలు తెలిపాయి.
అంతేకాదు ఛోటెడోంగర్‌కు చెందిన పద్మశ్రీ వైద్యరాజ్ హేమచంద్ర మాంఝీని బ్రోకర్‌గా అభివర్ణించి దేశం నుంచి వెళ్లిపోవాలని నక్సలైట్లు(Naxalites) బెదిరించారు. ఇప్పటికే పద్మశ్రీ హేమచంద్ర మాంఝీ మేనల్లుడు కోమల్ మాంఝీని నక్సలైట్లు దారుణంగా హత్య చేశారు. వైద్యరాజ్ హేమచంద్ర మాంఝీని బ్రోకర్ అని ఆరోపిస్తూ బెదిరిస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రంలోని సేఫ్ హౌస్‌లో వైద్యరాజ్‌కు పోలీసు(police) యంత్రాంగం భద్రత కల్పించింది.
ఈ ప్రాంతంలో బీజేపీకి చెందిన ముగ్గురు కీలక నేతలను నక్సలైట్లు ఇప్పటికే హతమార్చారు. వారిలో సాగర్ సాహు, రతన్ దూబే, పంచమ్ దాస్ ఉన్నారు. బీజేపీ(BJP) నేతల హత్య అనంతరం ఆయా ప్రాంతాల్లో ఉంటున్న కీలక నేతలను జిల్లా కేంద్రానికి తరలించి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు నక్సలైట్ల హిట్ లిస్ట్‌లో ఉన్న నేతలు, గ్రామస్తులకు కూడా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేశారు. వారిలో పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు.
ఇది కూడా చదవండి:
Remal Cyclone: రెమాల్ తుపాను బీభత్సం..నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
Kaviya Maran: సన్ రైజర్స్ ఓటమితో కన్నీరు పెట్టుకున్న కావ్య పాప..వీడియో వైరల్
Read Latest National News and Telugu News
Updated Date - May 27 , 2024 | 11:35 AM