ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kangana Ranaut: కంగనాపై అభ్యంతరకర పోస్టు.. మహిళా కమిషన్ సీరియస్.. ఎన్నికల సంఘానికి లేఖ

ABN, Publish Date - Mar 26 , 2024 | 08:23 AM

లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్‌(Kangana Ranaut)ను ప్రకటించినప్పటి నుంచి.. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన పలు అంశాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నాయకులు సుప్రియా శ్రీనెత్, హెచ్‌ఎస్‌ అహిర్‌ కంగనా టార్గెట్‌గా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌ (NCW) స్పందించింది.

Kangana Ranaut

లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్‌(Kangana Ranaut)ను ప్రకటించినప్పటి నుంచి.. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన పలు అంశాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నాయకులు సుప్రియా శ్రీనెత్, హెచ్‌ఎస్‌ అహిర్‌ కంగనా టార్గెట్‌గా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌ (NCW) స్పందించింది. సుప్రియా శ్రీనెత్, హెచ్‌ఎస్‌ అహిర్‌‌లపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. మరోవైపు ఈ పోస్టుపై తీవ్ర దుమారం చెలరేగతంలో శ్రీనెట్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి అభ్యంతరకరమైన పోస్టును తొలగించారు.

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తూ.. సుప్రియ శ్రీనెట్ పోస్టు చూసిన తర్వాత.. ఆమె ప్రవర్తనతో జాతీయ మహిళా కమిషన్ దిగ్భ్రాంతి చెందిందని పేర్కొన్నారు. మహిళల పట్ల ఇటువంటి ప్రవర్తన క్షమించరానిదని, మహిళల గౌరవానికి భంగం కలిగించేదిగా ఉందన్నారు. సుప్రియ శ్రీనెట్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రేఖా శర్మ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

BJP vs Congress: వాయనాడ్ లోనూ అమేథీ పరిస్థితే.. రాహుల్ పై బీజేపీ సంచలన కామెంట్స్..

కంగనా స్పందన..

సుప్రియ శ్రీనెట్ పోస్టుపై కంగనా స్పందిస్తూ.. క్వీన్‌లో అమాయక పాత్ర నుంచి తలైవిలో పవర్‌ఫుల్ మహిళా నేత వరకు, మణికర్ణకలో దేవత పాత్ర నుంచి చంద్రముఖిలో దెయ్యం పాత్ర వరకు.. 20 ఏళ్ల తన సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రల్లో నటించానని తెలిపారు. మహిళలను దురాభిమానపు సంకెళ్ల నుంచి కాపాడుకోవాలని, సెక్స్ వర్కర్ల దుర్భర జీవితానలు ప్రస్తావిస్తూ ఇతరులను దూషించడం మానుకోవాలని కంగనా కోరారు. ప్రతి మహిళ తన గౌరవానికి అర్హురాలని తెలిపారు.

పోస్టుతో సంబంధం లేదు..

కంగనాపై పోస్టు వైరల్ కావడంతో సుప్రియ శ్రీనెట్ స్పందించారు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పోస్టు తాను చేసింది కాదన్నారు. తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల యాక్సెస్ చాలా మంది వద్ద ఉన్నాయని, వారిలో ఒకరు ఈ అభ్యంతరకర పోస్ట్ పెట్టినట్లు తెలిపారు. తన దృష్టికి వచ్చిన వెంటనే ఆ పోస్టును తొలగించానని, ఏ మహిళ గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు తాను చేయనన్నారు. నా గురించి నాతో పరిచయం ఉన్న వాళ్లకు తెలుసని సుప్రియా తెలిపారు.

లోక్‌సభ బరిలో కంగనా రనౌత్‌

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 26 , 2024 | 08:23 AM

Advertising
Advertising