Rahul Gandhi: ముంచుకొస్తున్న ముప్పు.. కలిసికట్టుగా పరిష్కారం కనుగొనాలి
ABN, Publish Date - Nov 22 , 2024 | 06:10 PM
మరికొద్ది రోజుల్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని, వాయు కాలుష్య సంక్షోభంపై సమగ్రంగా చర్చించాల్సిన బాధ్యత ఎంపీలపై ఉందని రాహుల్ అన్నారు. దేశం ఎదుర్కొంటున్న ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనుగొనాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం జాతీయ విపత్తని, ఒకరిపై మరొకరు రాజకీయ నిందారోపణలు చేసుకోకుండా కలిసికట్టుగా దీనికి పరిష్కారం కనుగొనాలని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన సంక్షోభమని, ఇందువల్ల మన పిల్లల భవిష్యత్తు, పెద్దల ఆరోగ్యం, పర్యావరణం, ఆర్థిక విపత్తుతో పాటు అనేకమంది జీవితాలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. ఈ మేరకు పర్యావరణ వేత్త విమ్‌లేందు ఝాతో ఇండియా గేట్ వద్ద జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో రాహుల్ పోస్ట్ చేశారు.
Cash For Votes Row: ఖర్గే, రాహుల్‌కు వినోద్ తావ్డే పరువునష్టం నోటీసులు
''వాతావరణ కాలుష్యం వల్ల పేద ప్రజానీకం ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. తమను చుట్టుముడుతున్న విషగాలుల నుంచి వారు తప్పించుకులేకుంటారు. విషపూరిత వాతావరణం వల్ల పర్యాటకం, గ్లోబల్ రెప్యుటేషన్ తగ్గుతోంది. విషపూరితంగా మారుతున్న వాతావరణాన్ని శుభ్రం చేయాల్సి ఉంది. కాలుష్య మేఘాలు వేలాది కిలోమీటర్లు విస్తరిస్తున్నందున ప్రభుత్వాలు, కంపెనీలు, నిపుణులు, పౌరులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. రాజకీయ నిందారోపణలు చేసుకోకుండా సమష్టి జాతీయ బాధ్యతగా గుర్తించి పరిష్కారం కనుగొనాలి'' అని రాహుల్ అన్నారు.
మరికొద్ది రోజుల్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని, వాయు కాలుష్య సంక్షోభంపై సమగ్రంగా చర్చించాల్సిన బాధ్యత ఎంపీలపై ఉందని రాహుల్ అన్నారు. దేశం ఎదుర్కొంటున్న ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనుగొనాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉత్తరభారతదేశం లోని పలు ప్రాంతాలు, ముఖ్యంగా ఢిల్లీ, సరిహద్దు సిటీలైన నొయిడా, ఘజియాబాద్, గురుగావ్, ఫరీదాబాద్‌లు గత కొద్ది వారాలుగా తీవ్రవాయికాలుష్యంతో విలవిల్లాడుతున్నారు.
ఇవి కూడా చదవండి...
Supreme Court: ఢిల్లీ ప్రవేశమార్గాలపై సుప్రీం కీలక ఆదేశాలు
Maharashtra CM: ఎన్నికల ఫలితాలకు ముందే.. పవార్ సీఎం అంటూ పోస్టర్లు, ఊరేగింపులు
Rain Alert: 9 రాష్ట్రాల్లో వడగళ్ల వర్షం హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో పొగమంచు కూడా..
Updated Date - Nov 22 , 2024 | 06:10 PM