Share News

Maha Kumbh Mela 2025: జోరందుకున్న మహాకుంభ మేళా 2025.. ఈసారి టెక్నాలజీతో కూడిన

ABN , Publish Date - Dec 19 , 2024 | 08:54 PM

ప్రయాగ్‌రాజ్‌లో 2025లో జరగనున్న మహాకుంభ మేళా కోసం సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈసారి ఈ మేళా ఆధ్యాత్మిక, గ్రాండ్‌గా ఉండటమే కాదు, డిజిటల్ టెక్నాలజీతో కూడి ఉంటుందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈసారి మేళా ఎప్పటి నుంచి మొదలవుతుంది, స్పెషల్ ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Maha Kumbh Mela 2025: జోరందుకున్న మహాకుంభ మేళా 2025.. ఈసారి టెక్నాలజీతో కూడిన
Maha Kumbh Mela 2025

ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే ఏడాది నిర్వహించే మహాకుంభ మేళా 2025 (Maha Kumbh Mela 2025) కోసం సన్నాహాలు జోరందుకున్నాయి. ఈసారి మహాకుంభ మేళా ఆధ్యాత్మికంగా, గ్రాండ్‌గా ఉండడమే కాకుండా డిజిటల్ టెక్నాలజీతో కూడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చొరవతో, పోలీసు ఫోర్స్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఈవెంట్‌ను మరింత సురక్షితంగా, నిర్వహించడంలో ఈ యాప్ సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.


పోలీసు సిబ్బందికి

యోగి ఆదిత్యనాథ్ సూచనల మేరకు, మహాకుంభ సమయంలో వివిధ రకాల సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ యాప్ పోలీసు సిబ్బందికి సహాయపడుతుంది. ఇది సమీప ప్రాంతం గురించి వివరణాత్మక మార్గాలు, ప్రధాన సైట్‌లు, పోలీసు అధికారుల సంప్రదింపు నంబర్‌ల వంటి పూర్తి సమాచారాన్ని కలిగి ఉంటుంది. మహా కుంభమేళా 2025 పోలీస్ మొబైల్ యాప్ ప్రధాన లక్ష్యం క్రౌడ్ మేనేజ్‌మెంట్, అత్యవసర పరిస్థితులకు త్వరిత ప్రతిస్పందన అందించడం. ఇది రియల్ టైమ్ కమ్యూనికేషన్, ఇన్సిడెంట్ రిపోర్టింగ్, స్టేటస్ అప్‌డేట్‌ల వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఇది అన్ని స్థాయిల అధికారుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తుంది.


12 సంవత్సరాలకు ఒకసారి

ఈసారి మహా కుంభమేళా జనవరి 13, 2025 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు ప్రయాగ్‌రాజ్‌లో జరగబోతోంది. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు లక్షలాది మంది యాత్రికులు వస్తుంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభమేళా 2025లో ప్రయాగ్‌రాజ్‌లో జరగనుంది. ప్రయాగ్‌రాజ్ మహాకుంభ మేళా 2025 పౌష్ పూర్ణిమ స్నానంతో ప్రారంభమవుతుంది. మహాశివరాత్రి రోజు చివరి షాహి స్నాన్‌తో ముగుస్తుంది. మహాకుంభంలో కల్పవాసం చేసే భక్తులు ప్రతిరోజూ మూడుసార్లు స్నానం చేస్తారు. పౌష్ పూర్ణిమ 13 జనవరి 2025న ఉంది. కాబట్టి ఈ రోజు నుంచే మహా కుంభమేళా ప్రారంభమవుతుంది.


మహాకుంభ 2025 రాజ స్నానం తేదీలు-

  • మకర సంక్రాంతి 14 జనవరి 2025

  • మౌని అమావాస్య- 29 జనవరి 2025

  • బసంత్ పంచమి- 3 ఫిబ్రవరి 2025

  • మాఘ పూర్ణిమ- 13 ఫిబ్రవరి 2025

  • మహాశివరాత్రి - 26 ఫిబ్రవరి 2025


స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత

రాజ స్నానం మతపరమైన ప్రాముఖ్యత- హిందూ మతంలో మహాకుంభ స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ సమయంలో త్రివేణి సంగమం ఒడ్డున స్నానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. మహాకుంభంలో స్నానం చేసిన వ్యక్తికి వారి జీవితంలో మంచి జరుగుతుందని భావిస్తారు.

ఆ క్రమంలో మోక్షాన్ని పొంది పాపాల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతుంటారు. గ్రంధాల ప్రకారం ఋషులు, నాగ సాధువులకు షాహి స్నాన్ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. మహాకుంభం మొదటి రోజున రవియోగం ఉదయం 07:15 నుంచి 10:38 వరకు ఉంటుంది. రవియోగంలో స్నానం, దానం చేయడం వల్ల ఎనలేని ఫలితాలు లభిస్తాయని నమ్మకం.


ఇవి కూడా చదవండి:

Fadnavis: మీరు ఏదో ఒక రోజు సీఎం అవుతారు.. అజిత్ పవార్‌పై ఫడ్నవీస్ వ్యాఖ్యలు


Spherical Egg: ఒక కోడి గుడ్డు ధర రూ. 21 వేలు.. స్పెషల్ ఏంటో తెలుసా..


Choti Choti Savings: ఈ చిన్నారి పొదుపును చూస్తే షాక్ అవుతారు.. వైరల్ వీడియో

Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..

Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..


Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 19 , 2024 | 08:56 PM