ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kolkata: వైద్యులపై దాడికి కుట్ర.. ఆడియో క్లిప్‌ విడుదల చేసిన టీఎంసీ

ABN, Publish Date - Sep 14 , 2024 | 04:49 PM

'స్వాస్థ్య భవన్' ఎదుట నిరసన తెలుపుతున్న జూనియర్ వైద్యులపై దాడి జరిపేందుకు కుట్ర జరుగుతోందంటూ తృణమూల్ కాంగ్రెస్ నేత కునాల్ ఘోష్ సంచలన ఆరోపణ చేశారు.

కోల్‌కతా: ఆర్జీ కర్ ఆసుపత్రి ట్రయినీ వైద్యురాలిపై హత్యాచారం ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. 'స్వాస్థ్య భవన్' ఎదుట నిరసన తెలుపుతున్న జూనియర్ వైద్యులపై దాడి జరిపేందుకు కుట్ర జరుగుతోందంటూ తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేత కునాల్ ఘోష్ సంచలన ఆరోపణ చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే ఈ దాడి కుట్ర జరుగుతోందన్నారు. తన ఆరోపణలకు బలం చేకూర్చే ఆడియో క్లిప్‌ను కూడా ఆయన విడుదల చేశారు. వెంటనే రంగంలోకి దిగిన కోల్‌కతా పోలీసులు ఈ క్లిప్‌తో ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిలో సీపీఎం నేత కలతాన్ దాస్‌గుప్తా కూడా ఉన్నారు.


దాస్‌గుప్తాను స్వాస్ధ్య భవన్‌లో సెక్టార్ 5లో అరెస్టు చేయగా, మరో వ్యక్త సంజీవ్ దాస్‌గా గుర్తించారు. అతనిని శుక్రవారం రాత్రి సౌత్ కోల్‌కతాలోని హాల్టులో అరెస్టు చేశారు. ఆడియో క్లిప్‌కు సంబంధించి కోల్‌కతా పోలీసులు సుమోటో కేసును నమోదు చేశారు.

Mamata Banerjee: అక్కగా వచ్చా, సీఎంగా కాదు.. నిరసన శిబిరంలో వైద్యులతో మమతా బెనర్జీ


ఆడియో క్లిప్‌లో ఏముంది?

కునాల్ ఘోష్ మీడియా సమావేశంలో విడుదల చేసిన ఆడియో క్లిప్‌లో ఇద్దరు వ్యక్తులు జూనియర్ వైద్యులపై దాడికి ప్లాన్ చేస్తున్న మాటలు వినిపిస్తున్నాయి. దాడి నిందను టీఎంసీపై నెట్టాలని వారు అనుకోవడం కూడా అందులో వినిపిస్తోంది. ఇందులో ఒక వ్యక్తి నిరసన శిబిరంపై దాడి చేయాలని 'సాహెబ్' నుంచి ఆదేశాలు వచ్చాయని చెబుతుండగా, ఆ పని వెంటనే చేయాలని రెండో వ్యక్తి సమాధానమిచ్చాడు. దీనికి మొదటి వ్యక్తి తిరిగి మాట్లాడుతూ, చాలా ఏళ్లుగా తాను ఇలాంటి పనులు చేస్తున్నప్పటికీ వాళ్లు వైద్యులు అయినందున తన మనసు ఒప్పుకోవడం లేదని చెప్పాడు. దీంతో రెండో వ్యక్తి అతనికి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. వాళ్లను అంతం చేయాల్సిన అవసరం లేదని, దాడి మాత్రమే చేయాలని అతను చెప్పడం ఆడియోలో వినిపిస్తోంది. కాగా, ఆడియో క్లిప్ వెలుగు చూసిన నేపథ్యంలో వైద్యుల నిరసన శిబిరం వద్ద 12 చోట్ల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అక్కడ మోహరించిన పోలీసు సిబ్బంది సంఖ్యను 250 నుంచి 500కు పెంచారు.


Read MoreNational News and Latest Telugu News

Rain Alert: 18 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. IMD హెచ్చరిక

Aadhaar Free Update: మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేశారా లేదా లాస్ట్ ఛాన్స్.. మిస్సైతే మీకే నష్టం..

Updated Date - Sep 14 , 2024 | 04:49 PM

Advertising
Advertising