ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మోదీకి నైజీరియా రెండో అత్యున్నత అవార్డు

ABN, Publish Date - Nov 18 , 2024 | 01:59 AM

తొలిసారి నైజీరియా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి ఆ దేశంలో అరుదైన గౌరవం దక్కింది. నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం అయిన ‘గ్రాండ్‌ కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది నైగర్‌’ అవార్డుతో ఆ దేశం మోదీని సత్కరించింది.

  • రాణి ఎలిజబెత్‌ తర్వాత తొలిసారి ఓ విదేశీ వ్యక్తికి

  • కల్పితం కొంత కాలమే.. నిజం వెలుగుచూస్తోంది

  • సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చూపించారు

  • సబర్మతీ రిపోర్టు సినిమాపై ప్రధాని ప్రశంస

  • నైజీరియాలో ప్రధానికి ఘన స్వాగతం

న్యూఢిల్లీ, నవంబరు 17: తొలిసారి నైజీరియా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి ఆ దేశంలో అరుదైన గౌరవం దక్కింది. నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం అయిన ‘గ్రాండ్‌ కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది నైగర్‌’ అవార్డుతో ఆ దేశం మోదీని సత్కరించింది. ఈ అవార్డును ఆదివారం మోదీకి అందజేసింది. నైజీరియన్లు కాకుండా.. 1969లో క్వీన్‌ ఎలిజబెత్‌ తర్వాత ఈ అవార్డును అందుకున్న రెండో విదేశీ వ్యక్తి మోదీనే కావడం విశేషం. ఈ అవార్డును తనకు అందజేసిన నైజీరియా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును 140 కోట్ల భారతదేశ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. విదేశాల్లో మోదీ అందుకున్న అత్యున్నత అంతర్జాతీయ అవార్డుల్లో ఇది 17వ పురస్కారం. ఆ దేశాధ్యక్షుడు బోలా అహ్మద్‌ తినూబూ ఆహ్వానం మేరకు ఆదివారం నైజీరియా చేరుకున్న మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది.

నైజీరియా ప్రధానమంత్రి నెసోమ్‌ ఎజెన్వో ఎయిర్‌పోర్టుకు చేరుకుని మోదీని అబుజా నగరంలోకి ఆహ్వానిస్తున్నట్లు సంకేతంగా ఓ తాళాన్ని అందజేశారు. ఓ వ్యక్తిపై నమ్మకం, గౌరవానికి సూచికగా నైజీరియన్లు ఆ తాళాన్ని అందజేస్తారని భారత విదేశీ వ్యవహారాలశాఖ ఎక్స్‌లో పేర్కొంది. అనంతరం ఆ దేశాధ్యక్ష భవనానికి చేరుకున్న మోదీ నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్‌ తినుబూతో సమావేశమై ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. నైజీరియా పర్యటన అనంతరం జీ- 20 సదస్సులో పాల్గొనేందుకు మోదీ బ్రెజిల్‌ వెళ్లనున్నారు. అటు నుంచి గయానా వెళ్లి భారత్‌కు తిరిగి రానున్నారు.

Updated Date - Nov 18 , 2024 | 02:01 AM