ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maharashtra: బీజేపీ కేంద్ర పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపాని

ABN, Publish Date - Dec 02 , 2024 | 04:43 PM

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేనని, దీనిపై వస్తున్న వదంతులన్నీ నిరాధారమని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తనయుడు శ్రీధర్ షిండే సోమవారంనాడు వివరణ ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత ఎంపికపై కేంద్ర పరిశీలను పార్టీ అధిష్ఠానం నియమించింది.

ముంబై: మహారాష్ట్ర (Maharashtra) కొత్త ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్‌ కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత ఎంపికపై పార్టీ పరిశీలకులను బీజేపీ అధిష్ఠానం సోమవారంనాడు నియమించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman), విజయ్ రూపానీ (Vijay Rupani) లను పరిశీలకులు (observers)గా నియమించింది. డిసెంబర్ 4న బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలతో కేంద్ర పరిశీలకులు చర్చిస్తారు. అనంతరం ఏకగ్రీవంగా లెజిస్లేచర్ పార్టీ నేతను ఎన్నుకుంటారు. ఎన్నికైన నేత కొత్త ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంటుంది.

Shrikant Shinde: ఉప ముఖ్యమంత్రి పదవిపై షిండే తనయుడు క్లారిటీ


మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేనని, దీనిపై వస్తున్న వదంతులన్నీ నిరాధారమని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తనయుడు శ్రీధర్ షిండే సోమవారంనాడు వివరణ ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత ఎంపికపై కేంద్ర పరిశీలను పార్టీ అధిష్ఠానం నియమించింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్ర మంత్రిగా తనకు అవకాశం వచ్చిందని, అయితే పార్టీ ఆర్గనైజేషన్ కోసమే పనిచేయాలని నిర్ణయించుకున్నందున ఆ పదవిని నిరాకరించారని శ్రీకాంత్ షిండే చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలోనూ తాను ఎలాంటి పదవిని ఆశించడం లేదని స్పష్టం చేశారు. న్యూస్ మీడియాలో ఉన్న పోటీ, ఆసక్తి తాను అర్ధం చేసుకోగలనని, ఇప్పటికైనా వదంతులను ఆపేయాలని కోరారు.


కాగా, ఏక్‌నాథ్ షిండే సైతం ఆదివారంనాడు సతారాలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎంపికపై ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఇప్పటికే తాను స్పష్టం చేశానని తెలిపారు. మహాయుతి కూటమి మధ్య చక్కటి అవగాహన ఉందని, ముఖ్యమంత్రి ఎవరనేది సోమవారం నిర్ణయించే అవకాశం ఉందని తెలిపారు. నవంబర్ 23న వెలువడిన మహారాష్ట్ర ఫలితాల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించింది. బీజేపీ 132 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, కూటమి భాగస్వాములైన ఏక్‌నాథ్ షిండే శివసేన 57, అజిత్ పవార్ ఎన్‌సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి.


ఇది కూడా చదవండి

Sabarmati Report: పార్లమెంటులో 'సబర్మతి రిపోర్ట్'ను వీక్షించనున్న మోదీ

Farmers Protest Impact: రైతుల నిరసన ఎఫెక్ట్.. ఎక్స్‌ప్రెస్‌వేపై 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

Cyclone Fengal Impact: ఫెంగల్ తుపాను కారణంగా 19 మంది మృతి.. ఎక్కడెక్కడంటే..

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 02 , 2024 | 04:43 PM